News March 12, 2025

పెండింగ్‌లో 10వేలకు పైగా పిటిషన్లు: రంగనాథ్

image

TG: అక్రమ కట్టడాలపై హైడ్రాకు పెద్ద ఎత్తున పిటిషన్లు వస్తున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఇప్పటికే 10వేలకు పైగా పిటిషన్లు పరిష్కరించకుండా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఒకప్పటి చెరువుల పరిస్థితి, ప్రస్తుత పట్టణీకరణ, హైడ్రా తీసుకుంటున్నచర్యలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతి సమస్యను లోతుగా అధ్యయనం చేశాకే పరిష్కారానికి కృషిచేస్తున్నామని వెల్లడించారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతుందని తెలిపారు.

Similar News

News November 26, 2025

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ చనిపోయారా?

image

పాక్ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ జైలులో చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ను చూసేందుకు రావల్పిండిలోని అడియాలా జైలుకు వచ్చిన ఆయన ముగ్గురు సోదరీమణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జైలు బయట PTI మద్దతుదారులతో కలిసి వారు ఆందోళనకు దిగారు. తమ సోదరుడిని చూపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు తమపై దాడి చేశారని, జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లారని ఆరోపించారు. 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ జైలులో ఉన్నారు.

News November 26, 2025

మూవీ అప్డేట్స్

image

* ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. రిలీజ్‌కు ముందే కేవలం తెలుగు స్టేట్స్‌లోనే రూ.130కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదల కానుంది.
*నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ‘NBK111’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ హిస్టారికల్ మూవీలో బాలయ్య డ్యుయల్ రోల్‌లో నటిస్తారని టాక్.

News November 26, 2025

iBOMMA రవికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్

image

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిపై పీటీ వారెంట్ వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. రవి కస్టడీ పిటిషన్‌పై కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది.