News May 20, 2024

18 లక్షలకుపైగా మొబైల్ కనెక్షన్లు రద్దు!

image

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఒకేసారి 18లక్షలకుపైగా మొబైల్ కనెక్షన్లను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే డివైజ్ నుంచి వేలల్లో సిమ్ కనెక్షన్లను వినియోగించిన సందర్భాలు తమ దర్యాప్తులో బయటపడ్డాయని అధికారులు వెల్లడించారు. ఇటీవల 28,220 ఫోన్లను బ్లాక్ చేయమని టెలికాం సంస్థలను కేంద్రం ఆదేశించింది. కాగా ఏడాదిలో 1.70కోట్ల కనెక్షన్లను కేంద్రం తొలగించింది.

Similar News

News December 23, 2024

హైకోర్టును ఆశ్రయించిన పేర్ని నాని

image

AP: రేషన్ బియ్యం అక్రమాల కేసులో పోలీసుల నోటీసులను క్వాష్ చేయాలని మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కొడుకు కిట్టు హైకోర్టును ఆశ్రయించారు. రేపు దీనిపై కోర్టు విచారణ చేయనుంది. మరోవైపు రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో పేర్ని నాని భార్య జయసుధ ఏ1గా ఉన్నారు. రేపు ఆమె ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై జిల్లా కోర్టులో విచారణ జరగనుంది.

News December 23, 2024

మంచు మనోజ్ ఫిర్యాదులో సంచలన ఆరోపణలు!

image

TG: తన సోదరుడు విష్ణుతో పాటు ఆరుగురిపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినయ్, విజయ్, కిరణ్, రాజ్‌తో పాటు శివల పేర్లను పేర్కొన్నారు. భార్య, పిల్లలకు ప్రాణహాని ఉందన్నారు. మోహన్ బాబుకు చెందిన యూనివర్సిటీతో పాటు ట్రస్ట్‌లో నిధుల దుర్వినియోగం జరిగిందని పేర్కొన్నారు. తన ఇంటికి విద్యుత్, నీటి సరఫరా లేకుండా కుట్ర పన్నినట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ కోసం హార్డ్ డిస్క్ దొంగిలించారని ఆరోపించారు.

News December 23, 2024

ఖేల్‌రత్నకు మను అర్హురాలు కాదా?

image

మనూ భాకర్.. భారత చరిత్రలో ఒకే ఒలింపిక్స్‌లో 2 మెడల్స్ సాధించిన స్టార్ షూటర్. ప్రపంచ వేదికపై తన ప్రదర్శనతో భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. దేశానికి కీర్తిప్రతిష్ఠలు తెచ్చిన ఆమె పేరును ఖేల్‌ర‌త్నకు నామినేట్ చేయలేదనే వార్తలు క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. క్రీడ‌ల్లో అత్యున్న‌త ప్ర‌ద‌ర్శ‌నకుగానూ ప్ర‌దానం చేసే ఈ అవార్డుకు ఆమె అర్హురాలు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు?