News August 21, 2024

డీఎస్సీపై 28వేలకు పైగా అభ్యంతరాలు.. ఈ నెలాఖరుకల్లా ఫలితాలు!

image

TG: డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలపై ఈ నెల 13 నుంచి 20 మధ్యలో 28 వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయని పాఠశాల విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఒక్కో ప్రశ్నపై వేలాదిమంది అభ్యంతరం చెప్పడం వల్లే మొత్తం సంఖ్య ఆ స్థాయికి చేరిందని వివరించాయి. ఫలితాలను ఈ నెలాఖరుకల్లా విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

Similar News

News December 8, 2025

ధోనీ భారత్‌లో పుట్టినందుకు మనం గర్వపడాలి: విజయ్

image

ధోనీ భారత్‌లో పుట్టినందుకు మనమందరం గర్వపడాలని IND మాజీ క్రికెటర్ మురళీ విజయ్ అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్‌‌లో మాట్లాడుతూ.. ‘ధోనీ సహజ, ప్రత్యేకమైన నాయకుడు. ఆయనలా నిర్ణయాలు తీసుకోవడం మరొకరికి సాధ్యం కాదు. 2007 T20 WC చివరి ఓవర్ జోగిందర్ శర్మతో వేయించడం ఇలాంటిదే. ధోనీ కొట్టే సిక్సర్ల రేంజ్ మరో రైట్ హ్యాండ్ బ్యాటర్‌ వల్ల కాదు’ అని వ్యాఖ్యానించారు. మహీ కెప్టెన్సీలో విజయ్ 8 సీజన్ల పాటు CSKకు ఆడారు.

News December 8, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు రాలేను: ఖర్గే లేఖ

image

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు హాజరు కాలేకపోతున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. పార్లమెంటు సమావేశాలు, ముందస్తుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాల నేపథ్యంలో రాలేకపోతున్నట్లు వివరించారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రేవంత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఇవాళ, రేపు సమ్మిట్ జరగనున్న విషయం తెలిసిందే.

News December 8, 2025

డిసెంబర్ 8: చరిత్రలో ఈ రోజు

image

1935: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర జననం
1939: గాయని ఎల్.ఆర్.ఈశ్వరి జననం(ఫొటోలో)
1953: హాస్యనటుడు మనోబాల జననం
1984: తెలుగు నటి హంసా నందిని జననం
2004: టాలీవుడ్ డైరెక్టర్ చిత్తజల్లు శ్రీనివాసరావు మరణం
2014: కర్ణాటక సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి మరణం