News August 15, 2024

సంక్షేమ గురుకులాల్లో 6వేలకు పైగా ఉద్యోగాలు!

image

TG: రాష్ట్రంలోని SC, ST, BC, మైనారిటీ, సాధారణ గురుకులాల్లో 6వేలకు పైగా పోస్టులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2023లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో 1,800కుపైగా బ్యాక్‌లాగ్ ఖాళీలు ఉన్నట్లు అంచనా. డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీతోపాటు వివిధ విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను 2025-26 జాబ్ క్యాలెండర్‌లో భర్తీ చేయనున్నట్లు సమాచారం. డీఎస్సీ, జేఎల్ నియామకాల తర్వాత మొత్తం ఖాళీలపై క్లారిటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు.

Similar News

News January 21, 2025

లబ్ధిదారుల లిస్టులో మీ పేరు లేదా? ఇలా చేయండి!

image

TG: ఈనెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటి అమలు విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి జరుగుతుందని చెప్పారు. నేటి నుంచి గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని, అర్హత ఉండి లిస్టులో పేరు లేని వారు గ్రామ సభల్లో అధికారులకు అప్లికేషన్లు ఇవ్వాలని సూచించారు.

News January 21, 2025

WEF: నేడు ఈ సంస్థలతో సీఎం రేవంత్ చర్చలు

image

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో రెండో రోజున CM రేవంత్ పలు కంపెనీలతో పెట్టుబడులపై చర్చించనున్నారు. అమెజాన్, యుని లివర్, స్కై రూట్ ఏరో స్పేస్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో వేర్వేరుగా చర్చలు జరుపుతారు. అనంతరం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సారథ్యంలో పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. IT, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

News January 21, 2025

పలువురు మావోయిస్టు కీలక నేతలు మృతి?

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన <<15211460>>ఎన్‌కౌంటర్‌లో <<>>14 మంది మావోయిస్టులు మృతి చెందగా, వారిలో కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నట్లు సమాచారం. చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి చిత్తూరు వాసి కాగా, ఆయనపై గతంలోనే రూ.కోటి రివార్డు ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో రెండ్రోజులుగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.