News April 7, 2025
రాష్ట్రంలో వెయ్యికి పైగా ధాన్యం కొనుగోలు సెంటర్లు ఓపెన్

TG: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వరికోతలు ఊపందుకోవడంతో వెయ్యికి పైగా కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేశారు. రానున్న రోజుల్లో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉండటంతో మొత్తం 8వేల సెంటర్లను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఈసారి 56.69 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగగా 90 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు.
Similar News
News December 15, 2025
AP న్యూస్ రౌండప్

* నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామాను కలెక్టర్ హిమాన్షు ఆమోదించారు. త్వరలో కొత్త మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం.
* రఘురామకృష్ణరాజును హింసించారనే ఆరోపణల కేసులో ఐపీఎస్ సునీల్ కుమార్ ఇవాళ గుంటూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకానున్నారు.
* ఏపీ లిక్కర్ కేసులో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయ్ బెయిల్ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
News December 15, 2025
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నేడు బాధ్యతలు చేపట్టనున్న నితిన్

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బిహార్ మంత్రి నితిన్ నబీన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా నితిన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బిహార్ నుంచి నియమితులైన తొలి వ్యక్తిగా, పిన్న వయస్కుడిగానూ ఆయన నిలిచారు. త్వరలోనే నితిన్‌ను జాతీయ అధ్యక్షుడిగా నియమించే అవకాశముందని తెలుస్తోంది.
News December 15, 2025
ఆరేళ్లలో 12.59 లక్షల కుటుంబాల వలస

AP: రాష్ట్రంలో ఆరేళ్లలో 12.59 లక్షల కుటుంబాలు వలస వెళ్లినట్లు సచివాలయాల సర్వేలో వెల్లడైంది. వారంతా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో పనులు చేసుకుంటున్నట్లు తేలింది. రాష్ట్రంలో 1.71 కోట్ల కుటుంబాలుండగా అత్యధికంగా విశాఖ(D)లో 1.13 లక్షలు, నెల్లూరులో 85వేల ఫ్యామిలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా నిర్మాణ రంగంలో పనులు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.


