News July 21, 2024

లక్ష ఎకరాలకు పైగా పంట నష్టం!

image

AP: రాష్ట్రంలో వర్షాలు, వరదలు విధ్వంసాన్ని సృష్టించాయి. ఆరుగాలం కష్టపడిన రైతన్నలకు కన్నీరు మిగిల్చాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా లక్ష ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా. రెండు రోజులుగా వరి పొలాలు, నారుమళ్లు ముంపులోనే ఉన్నాయి. కొన్ని చోట్లైతే పంటభూముల్లో ఇసుక మేటలు వేసింది. బురద పేరుకుపోయింది. ఈ విపత్తు సమయంలో ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Similar News

News January 24, 2025

వేసవిలో విద్యుత్ ఉద్యోగుల బదిలీలు: భట్టి

image

TG: వేసవిలో విద్యుత్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఉంటుందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. వేసవిలో విద్యుత్ సరఫరాలో రెప్పపాటు అంతరాయం లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రజాభవన్‌లో అన్నారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ను గత ప్రభుత్వం వదిలేయడం వల్లే భారం పెరిగిందని, పర్యావరణ అనుమతులు తెచ్చి యూనిట్-2 ప్రారంభించుకున్నామని భట్టి తెలిపారు.

News January 24, 2025

ఈ బ్లడ్ గ్రూప్ వారు నాన్‌వెజ్ తింటున్నారా?

image

కొందరికి నాన్‌వెజ్ లేనిదే ముద్ద దిగదు. ఎక్కువ మంది చికెన్, మటన్ తినడానికి ఇష్టపడతారు. కొన్ని బ్లడ్ గ్రూపుల వారు మాంసాహారం తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. A బ్లడ్ గ్రూప్ వారికి రోగనిరోధక వ్యవస్థ సున్నితంగా ఉండి జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయదు. చికెన్, మటన్ వంటివి జీర్ణించుకోలేరు. వీరు పప్పులు, కూరగాయలు తినడం బెటర్. B గ్రూప్ వారు ప్రతిదీ తినొచ్చు. AB, O గ్రూప్ వారు సమతుల్యంగా తినాలి.

News January 24, 2025

న్యూయార్క్‌ స్కూళ్లలో మొబైల్ బ్యాన్?

image

USలోని న్యూయార్క్‌ స్కూళ్లలో మొబైల్ వాడకంపై నిషేధం విధించే యోచనలో ఉన్నామని ఆ రాష్ట్ర గవర్నర్ కతి హోచుల్ తెలిపారు. ఇప్పటికే నగరంలోని 1500కు పైగా పబ్లిక్ స్కూళ్లలో సెల్ ఫోన్ వాడకంపై పరిమితులు విధించారని చెప్పారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం, చదువుపై ఫోకస్ చేసేందుకు ఈ ప్రణాళిక రచిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, అక్కడి స్కూళ్లలో 97% మంది విద్యార్థులు క్లాస్ నడిచేటప్పుడే ఫోన్ వాడుతున్నారని అంచనా.