News April 16, 2025
మార్నింగ్ న్యూస్ రౌండప్

☛ తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 12 గంటల సమయం
☛ నేడు యూరప్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు
☛ TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరోసారి శ్రవణ్ రావు విచారణ
☛ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ రేపు ఈడీ ఆఫీసు వద్ద ధర్నా: టీపీసీసీ చీఫ్
☛ అఫ్గానిస్థాన్‌లో 6.9 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు
Similar News
News April 16, 2025
ఫైబర్‌నెట్‌లో ఉద్యోగుల తొలగింపు

AP ఫైబర్‌నెట్‌లో ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సూర్య ఎంటర్ప్రైజెస్ ద్వారా నియమించిన వారంతా ఈ నెలాఖరులోగా రిలీవ్ కావాలని ఆదేశించింది. ఇకపై ఎలాంటి పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది. తొలగించిన వారిలో 500 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఫైబర్‌నెట్ నియామకాలు ఇష్టారీతిన జరిగాయని, కొందరు ఆఫీసులకు రాకుండానే జీతాలు తీసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించి చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
News April 16, 2025
బెంగాల్‌ను అప్రతిష్ఠపాలు చేసే కుట్ర: మమత

బెంగాల్‌ను భ్రష్టు పట్టించేందుకు కేంద్రం మీడియాను వాడుతోందని CM మమతా బెనర్జీ ఆరోపించారు. కొన్ని మీడియా సంస్థలను మోదీ పోషిస్తున్నారని విమర్శించారు. UP, కర్ణాటక, బిహార్, రాజస్థాన్‌కు చెందిన వీడియోలతో బెంగాల్‌ను అప్రతిష్ఠపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. యువతకు ఎన్ని ఉద్యోగాలొచ్చాయి?, పెరిగిన పెట్రోల్, డీజిల్, మెడిసిన్స్ ధరల గురించి మాట్లాడాలంటూ సవాల్ చేశారు.
News April 16, 2025
ఇన్‌స్టా ఫాలోయింగ్‌పై పూజా హేగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్ల సంఖ్య బాక్సాఫీసును డిసైడ్ చేయలేదని హీరోయిన్ పూజా హెగ్డే అన్నారు. ‘నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 30 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండొచ్చు. కానీ వారందరూ థియేటర్లకు వస్తారని కాదు. చాలా మంది సూపర్ స్టార్లకు 5 మిలియన్ల కంటే తక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాకు, వాస్తవానికి చాలా తేడా ఉందని అర్థం చేసుకోండి’ అని ఆమె తెలిపారు.