News August 13, 2025
మార్ఫింగ్ కేసు: ముగిసిన RGV విచారణ

AP: ఒంగోలు తాలూకా పీఎస్‌లో రామ్ గోపాల్ వర్మ విచారణ ముగిసింది. ఫొటోల మార్ఫింగ్ కేసులో దాదాపు 11 గం.పాటు RGVని పోలీసులు విచారించారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఆయన ‘X’లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుల వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీకి రూ.2 కోట్లు అందడంపై కూడా విచారించినట్లు సమాచారం.
Similar News
News August 13, 2025
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం తేదీల ప్రకటన

AP: విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం తేదీలు ఖరారయ్యాయి. అక్టోబర్ 6న అమ్మవారి తొలేళ్ల ఉత్సవం, 7వ తేదీన సిరిమానోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు ప్రకటించారు. అక్టోబర్ 14న జరిగే తెప్పోత్సవంతో జాతర ముగుస్తుందని తెలిపారు. ఈ ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.
News August 13, 2025
BIG BREAKING: సంచలన తీర్పు

TG: గవర్నర్ కోటాలో MLCలుగా ఎన్నికైన కోదండరాం, అలీఖాన్‌ల నియామకం రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ వ్యతిరేకించడం, వేరేవాళ్లను నియమించడాన్ని సవాల్ చేస్తూ BRS నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై ఈ తీర్పు ఇచ్చింది. తదుపరి విచారణను SEP 17కు వాయిదా వేసింది. ఖాళీ అయిన 2 MLC స్థానాల్లో నామినేషన్లు తమ తుది తీర్పుకు లోబడే ఉంటాయని SC పేర్కొంది.
News August 13, 2025
WFH ఇవ్వాలని కంపెనీలకు పోలీసుల సూచన

హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో IT కంపెనీలు, ఇతర సంస్థలకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. సైబరాబాద్ పరిధిలోని కంపెనీలు తమ ఉద్యోగులకు రేపు వర్క్ ఫ్రమ్ సదుపాయం కల్పించాలని ఓ ప్రకటనలో కోరారు. వర్షం, వరద కారణంగా ప్రయాణ సంబంధిత సమస్యలు లేకుండా ఉండటానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మీ కంపెనీలో ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారా? కామెంట్ చేయండి.