News August 4, 2024

‘మొస్సాద్’ మాస్టర్ మైండ్.. టూత్ పేస్ట్‌లో విషం కలిపి చంపింది!

image

హమాస్ చీఫ్ హనేయేని ఆయనున్న గదిలోనే బాంబ్ పెట్టి చంపి ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో గతంలో మొస్సాద్ చేసిన ఆపరేషన్ వైరల్ అవుతోంది. 1976లో ఓ విమానం హైజాక్ కాగా ప్రస్తుత PM నెతన్యాహు సోదరుడు లెఫ్టినెంట్ కర్నల్ యొనాతన్ టీమ్ విడిపించింది. అయితే యొనాతన్ చనిపోయారు. దీనికి ప్రతీకారంగా హైజాక్‌కు సూత్రధారైన హద్దాద్ అనే వ్యక్తిని విషపు టూత్ పేస్ట్ వాడేలా చేసి మొస్సాద్ చంపింది.

Similar News

News April 1, 2026

ఢిల్లీ బౌలర్లు భళా.. లక్నో స్కోర్ ఎంతంటే?

image

IPL: ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో లక్నో బ్యాటర్లు తడబడ్డారు. 18.4 ఓవర్లలో 141 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యారు. మార్ష్ 35, పంత్ 7, మార్క్రమ్ 11, పూరన్ 8, అబ్దుల్ సమద్ 36, ముకుల్ 14, షహబాజ్ అహ్మద్ 15* రన్స్ చేశారు. నటరాజన్, ఎంగిడి చెరో 3 వికెట్లతో లక్నో బ్యాటర్లను బోల్తా కొట్టించారు.

News April 1, 2026

పెరిగిన ఇండిగో విమాన టికెట్ల ధరలు

image

విమాన ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ భారాన్ని ప్రయాణికులపై మోపేందుకు ఇండిగో సిద్ధమైంది. ఏప్రిల్ 2 నుంచి టికెట్ బుకింగ్స్‌పై ఇంధన ఛార్జీలను సవరించనున్నట్లు ప్రకటించింది. దూరాన్ని బట్టి డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో ₹275-₹950, ఇంటర్నేషనల్ సర్వీసులలో ₹900-₹10,000 వరకు ఫ్యూయల్ ఛార్జెస్ పెరుగుతాయని తెలిపింది. డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌కు 25%, ఇంటర్నేషనల్ సర్వీసెస్‌పై 100% ఇంధన ధరలు పెరిగిన విషయం తెలిసిందే.

News April 1, 2026

LokPoll సర్వే.. మళ్లీ డీఎంకేదే అధికారం!

image

త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని LokPoll సర్వే వెల్లడించింది. DMK+కు 40.1% ఓట్లతో 181–189 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి 29% ఓట్లు, 38-42 సీట్లు, విజయ్ నేతృత్వంలోని TVK 23.9% ఓట్లు, 8-10 సీట్లు సాధిస్తాయని పేర్కొంది. ఇక సీఎంగా స్టాలిన్‌కు 41%, విజయ్‌కి 27.1%, పళనిస్వామికి 24.1% మంది మద్దతు పలికారని తెలిపింది.
<<-se>>#ELECTIONS2026<<>>