News March 21, 2024
ఫ్యూచర్ గేమింగ్ సంస్థ నుంచి ఎక్కువ ఫండ్స్ ఈ పార్టీలకే!
అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రై.లి. ఏ పార్టీకి ఎంత విరాళమిచ్చిందో వెల్లడైంది. 2020 నుంచి 2024 వరకు ఈ సంస్థ రూ.1,368 కోట్ల ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది. అందులో TMCకి రూ.542 కోట్లు, DMKకు రూ.503 కోట్లు, YSRCPకి రూ.154 కోట్లు, BJPకి రూ.100 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.50 కోట్లు అందాయి. భారత లాటరీ పరిశ్రమలో ఈ సంస్థ టర్నోవర్ రూ.1.65 లక్షల కోట్లు.
Similar News
News November 25, 2024
అన్‌సోల్డ్‌గా మిగిలిన విదేశీ ఆటగాళ్లు వీరే
ఐపీఎల్ మెగా వేలంలో విదేశీ ప్లేయర్లు బెన్ డకెట్, డెవాల్డ్ బ్రెవిస్, మొయిన్ అలీ, ఫిన్ అలెన్ అన్‌సోల్డ్‌గా మిగిలారు. విల్ జాక్స్‌ను ముంబై ఇండియన్స్ రూ.5.25 కోట్లు చెల్లించి కైవసం చేసుకుంది. టిమ్ డేవిడ్‌ను ఆర్సీబీ రూ.3 కోట్లతో సొంతం చేసుకుంది. షాబాజ్ అహ్మద్‌ను రూ.2.40 కోట్లకు LSG దక్కించుకుంది. దీపక్ హుడాను రూ.1.70 కోట్లు చెల్లించి సీఎస్కే తీసుకుంది.
News November 25, 2024
ఉద్యోగం నుంచి తొలగించినందుకు పరిహారం చెల్లించాలన్న కోర్టు!
చైనాకు చెందిన ఓ కెమికల్ కంపెనీలో పనిచేసే జాంగ్ అనే ఉద్యోగి ఆఫీసులో పడుకున్నాడని యాజమాన్యం అతణ్ని తొలగించింది. దీంతో అతను కోర్టును ఆశ్రయించారు. అతను 20 ఏళ్లుగా మంచి పనితీరు కనబరిచారని, ముందు రోజు ఆఫీసులో లేట్ అవడంతో పడుకున్నట్లు కోర్టు గుర్తించింది. ఈక్రమంలో అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు జాంగ్‌కు కంపెనీ 3,50,000 యువాన్లు(రూ.40.7 లక్షలు) పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
News November 25, 2024
UPI నగదు చెల్లింపుల్లో 6.32 లక్షల మోసాలు
UPI నగదు చెల్లింపుల్లో 2024-25 FYలో ₹485 Cr విలువైన 6.32 లక్షల మోసాలు జరిగినట్టు కేంద్రం తెలిపింది. గత FYలో ₹1,087 కోట్ల విలువైన 13.42 లక్షల మోసాలు జరిగినట్టు వెల్లడించింది. మోసాల కట్టడికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం తెలిపింది. యూపీఐ, ఇతర ఆన్లైన్ చెల్లింపుల్లో మీకు మోసాలు ఎదురైతే 1930కు ఫోన్ చేయండి, లేదా <