News August 3, 2024
స్విగ్గీ& జొమాటోలో ఎక్కువ ఆర్డర్ చేసిన శాకాహార వంటలివే!

తమ ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువగా ఆర్డర్ చేసిన శాకాహార వంటల డేటాను ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటో రిలీజ్ చేశాయి. అందులో ఎక్కువ మంది మసాలా దోసెను ఆర్డర్ చేశారట. దీని తర్వాత పనీర్ బటర్ మసాలా, దాల్ ఖిచ్డీ, పనీర్ బిర్యానీ, మార్గరీటా పిజ్జా, ముంబై స్ట్రీట్ ఫుడ్ క్లాసిక్ అయిన పావ్ భాజీ ఉన్నాయి. మీరు ఎక్కువగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఏంటో కామెంట్ చేయండి.
Similar News
News November 24, 2025
ప్రజల నుంచి 450 అర్జీల స్వీకరణ: అనంత కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం కలెక్టరేట్లోని PGRS కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలనుంచి 450 అర్జీలను స్వీకరించామని తెలిపారు. PGRS అర్జీలను నాణ్యతగా పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరగా పరిష్కరిస్తామని అన్నారు.
News November 24, 2025
ఐబొమ్మ రవి సంపాదన రూ.100 కోట్లు?

మూవీల పైరసీ, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌తో ఐబొమ్మ <<18377140>>రవి<<>> రూ.100 కోట్లకు పైగా సంపాదించాడని పోలీసులు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌ను సేకరించినట్లు సమాచారం. మూవీపై క్లిక్ చేయగానే 15 యాడ్స్‌కు లింక్ అయ్యేలా వెబ్సైట్లో ఏర్పాటు చేశాడని గుర్తించారు. మరోవైపు ఈ విచారణపై రేపు ప్రెస్మీట్లో సజ్జనార్ వివరాలను వెల్లడిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
News November 24, 2025
అక్రమ మైనింగ్.. ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

TG: పటాన్చెరు MLA మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్‌కు చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ అక్రమ మైనింగ్ చేసిందని ఈడీ గుర్తించింది. అనుమతి లేకుండా, పరిమితికి మించి మైనింగ్ చేస్తూ రూ.300 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.39Cr రాయల్టీ చెల్లించలేదని తెలిపింది. ఈ మేరకు మధుసూదన్‌కు చెందిన రూ.80 కోట్లు అటాచ్ చేసినట్లు ప్రకటనలో వెల్లడించింది.


