News August 6, 2024
ఎక్కువగా అమ్ముడవుతోన్న తెలుగు పుస్తకాలివే!

పుస్తక పఠనంతో ఒత్తిడి తగ్గడంతో పాటు నిద్ర మెరుగుపడుతుందంటారు. అందుకే చాలామంది ఖాళీ సమయాన్ని పుస్తకాలు చదివేందుకు కేటాయిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ‘భగవద్గీత’ చదివేందుకు ఇష్టపడుతున్నారు. ‘best selling telugu books’లో ఈ గ్రంథమే ప్రథమ స్థానంలో ఉంది. దీని తర్వాత ‘నేను మీ బ్రహ్మానందం’, ‘శ్రీ గురు చరిత్ర’, ‘వెన్నెల్లో ఆడపిల్ల’, ‘ఒక యోగి ఆత్మకథ’, ‘కన్యాశుల్కం’ ఉన్నాయి.
Similar News
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<
News November 27, 2025
చలికాలంలో పాదాలు పగులుతున్నాయా?

చలికాలంలో కనిపించే ప్రధాన సమస్యల్లో మడమల పగుళ్లు ఒకటి. చలి కాలంలో పొడి గాలుల కారణంగా మడమల చర్మంలో తేమ తగ్గుతుంది. ఈ కారణంగా చర్మం పొడిగా మారి పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ అప్లై చేసి సాక్సులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. డీ హైడ్రేషన్ వల్ల కూడా పాదాలు పగులుతాయి కాబట్టి తగినంత నీరు తాగాలని చెబుతున్నారు.
News November 27, 2025
పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉంది: సుప్రీంకోర్టు

నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. గుజరాత్కు చెందిన విజయ్ మురళీధర్ ఉద్వానీ కేసు విచారణలో జడ్జీలు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 2022 జులైలో దుబాయ్ పారిపోయిన ఉద్వానీపై గుజరాత్ హైకోర్టు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. దానిని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది.


