News April 30, 2024

కత్తులతో పొడుచుకున్న తల్లీకూతుళ్లు.. ఎందుకంటే?

image

మార్కుల విషయంలో తల్లీకూతుళ్లు కత్తులతో పొడుచుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితీకి ఇంటర్‌ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయి. తక్కువ ఎందుకు వచ్చాయని తల్లి పద్మజ కుమార్తెతో వాగ్వాదానికి దిగింది. కత్తులు తీసుకుని ఒకరినొకరు పొడుచుకున్నారు. ఈ ఘటనలో కూతురు మరణించగా.. తల్లి గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు విచారణ చేస్తున్నారు.

Similar News

News March 23, 2026

ఎన్నికల కోసమే సేవలా: మోహన్ భాగవత్

image

సేవ చేయడం అంటే ఇతరులకు ఉపకారం చేయడం కాదని, అది ఒక బాధ్యత అని RSS చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. నిస్వార్థంగా సేవ చేస్తే కల్మషాలు తొలగిపోయి ఆత్మశుద్ధి జరుగుతుందని వివరించారు. కేవలం ఎన్నికల సమయంలోనో లేదా స్వార్థ ప్రయోజనాల కోసమో చేసే పనులు ఎక్కువ కాలం నిలబడవని, కోరికలు తీరగానే అలాంటి వారు సేవను వదిలేస్తారని విమర్శించారు. భయం వల్ల లేదా బలవంతంగా చేసేది కూడా నిజమైన సేవ అనిపించుకోదని పేర్కొన్నారు.

News March 23, 2026

యుద్ధానికి కావాల్సినంత డబ్బుంది: బెస్సెంట్

image

ఇరాన్‌పై యుద్ధాన్ని కొనసాగించేందుకు అమెరికా వద్ద కావాల్సినంత డబ్బు ఉందని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ స్పష్టం చేశారు. ట్రంప్ తన అధికార పరిధిలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నారని సమర్థించారు. యుద్ధం కోసం అదనంగా కేటాయిస్తున్న నిధులు కేవలం ఎక్స్‌ట్రా మాత్రమేనని.. అసలు పోరాటానికి సరిపడా డబ్బు ఇప్పటికే ఉందని తెలిపారు. ఇరాన్ విషయంలో ప్రస్తుతానికి అన్ని ఆప్షన్లు రెడీగా ఉన్నాయని పేర్కొన్నారు.

News March 23, 2026

మార్చి 23: చరిత్రలో ఈరోజు

image

1893: ఇంజినీర్ జి.డి.నాయుడు జననం
1934: సినీ గాయకుడు కె.బి.కె.మోహన్ రాజు జననం
1968: సినీ నటుడు శ్రీకాంత్ జననం
1979: సినీ గాయకుడు విజయ్ ఏసుదాస్ జననం
1987: నటి, పొలిటీషియన్ కంగనా రనౌత్ జననం
1931: జాతీయోద్యమ నాయకులు భగత్ సింగ్ (ఫొటోలో), సుఖ్ దేవ్ మరణం
* ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం