News September 24, 2025
అన్నపూర్ణా దేవి రూపంలో అమ్మవారు.. నేడు ఏ స్తోత్రం పఠించాలంటే?

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ నేడు అన్నపూర్ణా దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అన్నపూర్ణా దేవి సమస్త జీవరాశికి ఆహారాన్ని ప్రసాదించే తల్లిగా ప్రసిద్ధి చెందారు. ఈ రూపంలో దుర్గమ్మను తెల్ల పూలతో పూజించడం వల్ల జ్ఞానంతో పాటు ధనధాన్యాలు, సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ‘దద్యోజనం, కట్టెపొంగలి నైవేద్యంగా సమర్పించి, అన్నపూర్ణ, అష్టోత్తర స్తోత్రాలను పఠిస్తే శుభం కలుగుతుంది’ అంటున్నారు.
Similar News
News September 24, 2025
‘డాక్టర్ అవ్వాలని లేదు’.. NEET ర్యాంకర్ సూసైడ్

మహారాష్ట్ర చంద్రాపూర్‌కు చెందిన అనురాగ్ అనిల్ బోర్కర్ (19) అనే విద్యార్థి సూసైడ్ సంచలనంగా మారింది. మెడికల్ కాలేజ్‌లో జాయిన్ అయ్యేందుకు UP ఘోరఖ్‌పుర్ వెళ్లాల్సిన రోజే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నాకు డాక్టర్ అవ్వాలని లేదు’ అని సూసైడ్ నోట్‌లో రాసుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనురాగ్ NEET UG- 2025 పరీక్షలో ఆల్ ఇండియా 1475(99.99 పర్సంటైల్) ర్యాంకు సాధించాడు.
News September 24, 2025
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఏ భాషనైనా ఇట్టే చదివేయొచ్చు!

వాట్సాప్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని సహాయంతో వినియోగదారులు ఇతర భాషల్లోని మెసేజ్‌లను కావాల్సిన భాషల్లోకి అనువదించుకోవచ్చు. దీనికోసం మెసేజ్‌పై నొక్కి పట్టుకుంటే ట్రాన్స్‌లేట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేసి ఏ భాషలోకి అనువదించాలో దానిని ఎంచుకోండి. ఆండ్రాయిడ్ యూజర్లు అన్ని మెసేజ్‌లను ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌లేట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. *తెలుగు ఇంకా అందుబాటులోకి రాలేదు.
News September 24, 2025
ప్రతిపక్ష నేతగా గుర్తించాలని జగన్ పిటిషన్.. విచారణ వాయిదా

AP: తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది. కాగా ప్రతిపక్ష నేతగా జగన్‌ను గుర్తించేందుకు నిరాకరిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఫిబ్రవరి 5న రూలింగ్ ఇచ్చారు. ఆ రూలింగ్ చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని జగన్ కోర్టుకు వెళ్లారు.