News August 26, 2025

రేబీస్ సోకిందని పాపను చంపి తల్లి సూసైడ్

image

TG: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. యశోద(36) అనే మహిళ రేబీస్ సోకిందని తన మూడేళ్ల కూతురును చంపి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి యశోద భర్త సంచలన విషయాలు వెల్లడించారు. కుక్కలు ఎంగిలి చేసిన పల్లీలు తినడంతో పాపకు రేబీస్ సోకిందని యశోద అనుమానించిందని అన్నారు. టీకాలు వేయించినా అనుమానం పోలేదని, మతిస్తిమితం కోల్పోయిందని చెప్పారు. ఈ క్రమంలోనే పాపను చంపి తను ఉరివేసుకుందని తెలిపారు.

Similar News

News August 26, 2025

గుండెలను కలిచివేసే దృశ్యం: KTR

image

TG: రాష్ట్రంలో యూరియా కొరతకు అద్దం పడుతోందంటూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఓ చిత్రాన్ని Xలో షేర్ చేశారు. ‘గుండెలను కలిచివేసే దృశ్యం. విద్యార్థి స్కూల్‌‌కు వెళ్లకుండా ఎరువుల కోసం లైన్లో నిలబడాల్సిన దుస్థితి. కాంగ్రెస్, BJP ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయి. సమయానికి ఎరువులు ఇవ్వకుండా లక్షలాది మందిని అంతులేని లైన్లలో నిలబెట్టాయి. మన రైతులకు గౌరవం దక్కాలి.. ఇబ్బందులు కాదు’ అని విమర్శించారు.

News August 26, 2025

బ్యాంకులు ప్రజలను నియంత్రించొద్దు: సీఎం

image

AP: బ్యాంకులు, పబ్లిక్ పాలసీలు ప్రజలను నియంత్రించొద్దని CM చంద్రబాబు అన్నారు. బ్యాంకర్లతో సమావేశంలో మాట్లాడారు. ‘ఇప్పటికే రైతులకు రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీలు ఇవ్వాల్సింది. సీజన్ చివర్లో ఇస్తే ప్రయోజనం ఉండదు. సంస్కరణల దిశగా ప్రజలను ప్రోత్సహించాలి. రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా బ్యాంకుల నిర్ణయాలుండాలి’ అని సూచించారు. ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్’కు బ్యాంకుల సహకారంపై చర్చించారు.

News August 26, 2025

గణేశ్ ఉత్సవాలు ఇలా మొదలయ్యాయి!

image

పశ్చిమ భారతదేశంలో స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా ప్రజలను ఏకం చేసేందుకు బాల గంగాధర్ తిలక్ 1893లో గణేశ్ చతుర్థి వేడుకలను నిర్వహించారు. ప్రజలందరూ కలిసి జరుపుకునే ఓ సామాజిక ఉత్సవంగా మార్చారు. మతపరమైన వేడుకను ప్రజలందరూ కలిసి నిర్వహించడం ద్వారా వారికి ఏకత్వాన్ని, దేశభక్తిని గుర్తు చేశారు. ఆంగ్లేయులు రాజకీయ సమావేశాలను నిషేధించడంతో ఈ ఉత్సవాల ద్వారా జాతీయవాద ప్రసంగాలతో తిలక్ స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపారు.