News December 31, 2024

మాతృభాష నేర్చుకోవాలి.. కానీ అందులోనే బోధన సరికాదు: మురళి

image

TG: అందరూ మాతృభాష నేర్చుకోవాలని, కానీ అందులోనే బోధన ఉండాలనేది కరెక్ట్ కాదని విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి అభిప్రాయపడ్డారు. అలాగే ప్రైవేటు విద్యా సంస్థలు ఏటా ఫీజు పెంచుకోవాలనుకోవడం సరికాదన్నారు. ఓ స్కూల్ అప్లికేషన్ ఫీజు ₹4,500 ఉందని ఫైరయ్యారు. ఫీజుల నియంత్రణపై చట్టం తీసుకొచ్చేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి అధికారాలతో కూడిన ఓ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు.

Similar News

News March 5, 2026

అభిషేక్ మరోసారి ఫెయిల్

image

T20WCలో టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి ఫెయిల్ అయ్యారు. కీలకమైన సెమీఫైనల్లో రెండో ఓవర్లోనే భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చారు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ పైనా నిర్లక్ష్యపు షాట్ ఆడి 9 పరుగులకే ఔట్ కావడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఫైనల్‌కు వెళ్తే అతడిని పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ WCలో అభి 7 మ్యాచులు ఆడి 89 రన్స్ మాత్రమే చేశారు.

News March 5, 2026

టెన్త్ విద్యార్థులకు శుభవార్త.. హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీ జర్నీ

image

AP: టెన్త్ విద్యార్థులకు APSRTC శుభవార్త చెప్పింది. హాల్‌టికెట్లను కండక్టర్లకు చూపిస్తే ఈ నెల 16 నుంచి APR 1 వరకు పరీక్షా కేంద్రాలకు, ఇంటికి ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ప్రకటించింది. ‘పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. విద్యార్థులను ఎక్కించుకోకుండా వెళితే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడుపుతాం’ అని పేర్కొంది.

News March 5, 2026

X-RAY లేని కాలంలో గర్భస్థ శిశువుపై శిల్పాలు!

image

కేరళంలోని త్రిశూర్‌లో ఉన్న వడుగనాథ స్వామి ఆలయం భారతీయ శిల్పకళా చాతుర్యానికి, అప్పటి శాస్త్ర విజ్ఞానానికి సజీవ సాక్ష్యం. 2000 ఏళ్ల క్రితం ఎక్స్-రే, స్కానింగ్ వంటి ఆధునిక పరికరాలు లేని కాలంలోనే గర్భంలోని శిశువు నెలవారీ ఎదుగుదల భంగిమలను కళ్లకు కట్టినట్లు చెక్కారు. నిజంగా మన పూర్వీకులకు గర్భస్థ శిశువుపై ఉన్న పరిజ్ఞానం ఎంత గొప్పదో కదా! ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..