News October 22, 2024
లింగ సమానత్వం గురించి కొడుకులకు తల్లులే చెప్పాలి: కరీనా

ఆడపిల్లలను ఎలా గౌరవించాలనే విషయాన్ని అబ్బాయిలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలని కరీనా కపూర్ చెప్పారు. కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారంపై ఆమె NDTV సమ్మిట్‌లో స్పందించారు. ‘లింగ సమానత్వం గురించి బాయ్స్‌కు 4-5 ఏళ్ల నుంచే ఇంట్లో నేర్పించాలి. అసౌకర్యంగా ఉన్నప్పటికీ తల్లులే ఈ విషయాలపై వారితో మాట్లాడాలి. నా కొడుకులు తైమూర్(7), జహంగీర్(3)కు కూడా నేను ఆడపిల్లలను గౌరవించడం గురించి చెబుతా’ అని పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
పుతిన్ పర్యటన.. నేడు కీలకం!

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ ఇండియా-రష్యా 23వ వార్షిక సమ్మిట్‌లో పాల్గొననున్నారు. 11.50గం.కు <<18467026>>హైదరాబాద్ హౌస్<<>>లో ఈ మీటింగ్ జరగనుంది. రక్షణ బంధాల బలోపేతం, వాణిజ్యం, పౌర అణు ఇంధన సహకారం వంటి అంశాలపై PM మోదీతో చర్చించనున్నారు. S-400, మిసైళ్ల కొనుగోలు, రూపే-మిర్ అనుసంధానం సహా 25 వరకు కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. అధునాతన S-500 వ్యవస్థ, SU-57 విమానాల కొనుగోలుపైనా చర్చలు జరపనున్నారు.
News December 5, 2025
స్క్రబ్ టైఫస్ వ్యాధి.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

స్క్రబ్ టైఫస్‌ను వ్యాప్తి చేసే పురుగు పొలాలు, అడవులు, పశుగ్రాసం, తడి నేలల్లో ఎక్కువగా ఉంటోంది. పొలం పనులకు, పశుగ్రాస సేకరణకు వెళ్లే రైతులు తప్పనిసరిగా రబ్బరు బూట్లు, కాళ్లు, చేతులు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తడిసిన దుస్తులు ధరించొద్దు. పొలాల్లో, పశువుల కొట్టాల్లో పనిచేసేటప్పుడు ఏదైనా పురుగు కుట్టి నొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులుంటే ఆస్పత్రికి తప్పక వెళ్లండి.
News December 5, 2025
అవినీతి అధికారి గుట్టు రట్టు.. రూ.100కోట్లకు పైగా ఆస్తులు!

తెలంగాణ ACB మరో అవినీతి అధికారిని పట్టుకుంది. రంగారెడ్డి(D) సర్వే సెటిల్మెంట్&భూ రికార్డుల ఆఫీసులో ADగా పనిచేస్తున్న కొంతం శ్రీనివాసులుపై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. అతనికి HYDలో ఒక ఫ్లాట్, MBNRలో 4 ప్లాట్లు, NRPTలో రైస్ మిల్లు, 3 ప్లాట్లు, అనంతపురం, కర్ణాటకలో 22 ఎకరాల వ్యవసాయ భూమి, రెండు 4 వీలర్ వాహనాలు, 1.6kgs బంగారం, 770gms వెండి ఉన్నట్లు గుర్తించింది. వీటి వాల్యూ ₹100Cr+ ఉంటుందని అంచనా.


