News September 18, 2024
IIT బాంబేకు మోతిలాల్ ఓస్వాల్ రూ.130 కోట్ల విరాళం

మోతిలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ ఐఐటీ బాంబేకు రూ. 130 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. దీనిని విద్యా సంస్థలో ఆర్థిక రంగంలో పరిశ్రమ ఆధారిత వినూత్న కార్యక్రమాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన, పరిశోధనల మెరుగుకు ఖర్చు చేయనున్నారు. ఇది భారతీయ విద్యా సంస్థకు అందిన అతిపెద్ద కార్పొరేట్ విరాళాలలో ఒకటిగా నిలిచింది. దీని ద్వారా మోతిలాల్ ఓస్వాల్ నాలెడ్జ్ సెంటర్‌ను ఐఐటీ బాంబేలో ఏర్పాటు చేయనున్నారు.
Similar News
News September 15, 2025
భారీగా తగ్గిన స్విఫ్ట్ కారు ధర

GST సంస్కరణల నేపథ్యంలో మారుతీ సుజుకీ తమ కార్ల ధరలను తగ్గించింది. స్విఫ్ట్ కారు ధర వేరియంట్స్‌ను బట్టి రూ.55 వేల నుంచి గరిష్ఠంగా రూ.1.06లక్షల వరకు తగ్గింది. దీంతో బేసిక్ వేరియంట్ రేట్(ఎక్స్ షోరూం) రూ.5.94 లక్షలకు చేరింది. ఆల్టో కే10 ప్రారంభ ధర రూ.2.77 లక్షలు, ఎస్-ప్రెస్సో రేట్ రూ.3.90 లక్షలు, వాగన్R ధర రూ.5.26 లక్షలు, డిజైర్ రేట్ రూ.6.24 లక్షలకు తగ్గింది. ఈ ధరలు ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి.
News September 15, 2025
ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లు ట్రాన్స్ఫర్ అయ్యారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ధాత్రిరెడ్డి, ఫైబర్ నెట్ ఎండీగా గీతాంజలి శర్మ, మౌలిక సౌకర్యాలు, పెట్టుబడుల శాఖ ఎండీగా సౌర్యమాన్ పటేల్‌తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా ఐపీఎస్ రాహుల్ శర్మకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
News September 15, 2025
బండి సంజయ్‌పై కేటీఆర్ రూ.10 కోట్ల దావా

TG: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో రూ.10 కోట్ల దావా పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని గతంలో బండికి కేటీఆర్ నోటీసులు పంపారు. అయితే సంజయ్ వాటిపై స్పందించలేదు. దీంతో కేటీఆర్ చట్టపరమైన చర్యలకు దిగారు.