News January 25, 2025
మౌనీ అమావాస్య.. 10 కోట్ల మంది వస్తారని అంచనా!
ఈ నెల 29న మౌనీ అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో 10 కోట్ల మంది భక్తులు అమృతస్నానాలు చేస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం యూపీ ప్రభుత్వం 12 కి.మీ పొడవైన ప్రత్యేక ఘాట్ సిద్ధం చేస్తోంది. ఆ రోజున వీఐపీ జోన్ ఉండదని, ప్రముఖులకు అదనపు ఏర్పాట్లు ఉండవని తెలిపింది. ఫిబ్రవరి 3 (వసంత పంచమి), 12 (మాఘ పూర్ణిమ), 26 (మహా శివరాత్రి) తేదీల్లోనూ పెద్దఎత్తున అమృతస్నానాలు చేయనున్నారు.
Similar News
News February 5, 2025
విజయ్‌లో నాకు నచ్చనిది అదే: త్రిష
దళపతి విజయ్ షూటింగ్లో ఒక గోడ పక్కన మౌనంగా కూర్చొని ఉంటారని హీరోయిన్ త్రిష అన్నారు. ఆయనలో తనకు అదే నచ్చదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. విజయ్‌కి అది మార్చుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఏమైనా విజయ్ తనకు ఎప్పుడూ ప్రత్యేకమేనని చెప్పుకొచ్చారు. మరో నటుడు శింబు తనను షూటింగ్ సమయంలో టీజ్ చేస్తారని పేర్కొన్నారు. విజయ్, త్రిష జంటగా లియో, గిల్లితో పాటు పలు చిత్రాల్లో నటించారు.
News February 5, 2025
పంచాయతీ ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్?
తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలుకానుంది. కులగణన, జనాభా ఆధారంగా వారికి రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం స్పష్టతకు రావడంతో మరో వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం స్పందించకపోయినా, పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ చెప్పారు. దీంతో ఎన్నికల నిర్వహణకు ఎక్కువ టైం పట్టదంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
News February 5, 2025
మేడారంలో ఇవాళ్టి నుంచి శుద్ధి కార్యక్రమాలు
TG: ములుగు(D) తాడ్వాయి(మ) మేడారం మినీ జాతరకు సిద్ధమవుతోంది. ఇవాళ్టి నుంచి సమ్మక్క-సారలమ్మకు పూజలు ప్రారంభం కానున్నాయి. కన్నెపల్లిలో సారలమ్మ, మేడారంలోని సమ్మక్క ఆలయాల్లో అర్చకులు శుద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయాల్లోని పూజా సామగ్రిని శుద్ధి చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. దేవతల పీటలను శుభ్రం చేసి, ముగ్గులతో సుందరంగా అలంకరిస్తారు. ఈ నెల 12 నుంచి 15 వరకు మినీ జాతర వేడుకలు నిర్వహిస్తారు.