News July 6, 2025
NFDBని అమరావతికి తరలించండి: చంద్రబాబు

AP: HYDలో ఉన్న జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు(NFDB)ను అమరావతికి తరలించాలని CM చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ‘గతంలో దేశ మత్స్య రంగంలో AP పాత్ర గుర్తించి ఈ బోర్డును HYDలో ఏర్పాటు చేశారు. రాష్ట్రం విడిపోయినా ఆక్వా ఉత్పత్తుల్లో APదే కీలక వాటా. రూ.19,420 కోట్ల ఎగుమతులతో దేశానికి నాయకత్వం వహిస్తోంది. సుదీర్ఘ తీరం, రొయ్యల పరిశ్రమ ఉన్న APలో దీని ఏర్పాటుకు అనుకూల పరిస్థితులున్నాయి’ అని వివరించారు.
Similar News
News July 6, 2025
అకౌంట్లలోకి రూ.2వేలు.. పడేది అప్పుడేనా?

PM కిసాన్ సమ్మాన్ నిధి కింద 20వ విడత సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 18న నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈనెల 20న PM మోదీ బిహార్‌లో పర్యటించనున్న నేపథ్యంలో దానికి 2 రోజుల ముందే PM కిసాన్ నిధులు విడుదల చేసే ఛాన్స్ ఉందని జాతీయ మీడియా పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ పథకం కింద ఏటా 3 విడతల్లో ₹6వేలు అందిస్తోన్న సంగతి తెలిసిందే.
News July 6, 2025
కాసేపట్లో వర్షం: HYD వాతావరణ కేంద్రం

TG: రాబోయే 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, HYD, సంగారెడ్డి, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, వరంగల్, కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, భువనగిరి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షం పడుతుందని అంచనా వేసింది. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
News July 6, 2025
ఆంధ్ర మూలాలున్న పత్రికలను మేమెందుకు చదవాలి?: RSP

‘తెలంగాణ BRS జాగీరా?’ అంటూ వచ్చిన ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ ఫైరయ్యారు. తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ‘తెలంగాణ జ్యోతి’గా పేరు మార్చుకోకుండా సర్కులేట్ అవుతోందని మండిపడ్డారు. విశాలాంధ్ర మన తెలంగాణగా, ప్రజాశక్తి నవ తెలంగాణగా పేరు మార్చుకున్నాయని గుర్తు చేశారు. ఆంధ్ర పాలకుల తొత్తులకు వెన్నంటి నిలిచే ఆంధ్రమూలాలున్న పత్రిక/ఛానళ్లను TG ప్రజలు ఎందుకు చదవాలని ప్రశ్నించారు.