News September 1, 2025
సినీ ముచ్చట్లు

* విజయ్ దేవరకొండ, రష్మిక కాంబోలో మూడో మూవీ షూటింగ్ ప్రారంభం. నిర్మాతగా మైత్రీ మూవీ మేకర్స్: సినీ వర్గాలు
* పెంపుడు కుక్క ‘గూగుల్’ చనిపోయిందంటూ విక్టరీ వెంకటేశ్ ఎమోషనల్ పోస్ట్. 12 ఏళ్ల పాటు అంతులేని ప్రేమను, జ్ఞాపకాలను మిగిల్చిందంటూ భావోద్వేగం.
* యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో మూవీ తెరకెక్కించనున్న సూపర్ హిట్ ‘మిర్జాపూర్’ డైరెక్టర్ ఆనంద్ అయ్యర్. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌లో ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్!
Similar News
News January 31, 2026
OTTలోకి ‘MSVPG’.. అప్పుడేనా?

చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చి సూపర్ హిట్ అయిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. OTT హక్కులను జీ5 దక్కించుకోగా FEB 11 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు పేర్కొంటున్నాయి. JAN 12న రిలీజైన మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.360కోట్ల గ్రాస్ వసూలు చేసిన విషయం తెలిసిందే. అటు సంక్రాంతికి వచ్చిన <<19000195>>రాజాసాబ్<<>>, <<19002366>>నారీనారీ నడుమ మురారీ<<>> 0TT స్ట్రీమింగ్ డేట్లు ఫిక్స్ అయ్యాయి.
News January 31, 2026
ఇరాన్ వైపు భారీ యుద్ధ నౌకల కాన్వాయ్.. ట్రంప్ డెడ్‌లైన్ వార్నింగ్!

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మేం ఇరాన్ వైపు భారీ యుద్ధ నౌకల సమూహాన్ని పంపుతున్నాం. వారితో డీల్ కుదుర్చుకోవాలని ఆశిస్తున్నాం. వారు ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో చూద్దాం’ అని హెచ్చరించారు. న్యూక్లియర్ డీల్ కోసం తాను ఇప్పటికే ఒక డెడ్‌లైన్ విధించినట్లు చెప్పారు. అది ఎప్పటి వరకు అనేది మాత్రం బయటకు వెల్లడించలేదు.
News January 31, 2026
తండ్రి కానిస్టేబుల్.. కూతురు డీఎస్పీ

AP: తాత, తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న ఆమె త్వరలో ఖాకీ డ్రెస్ వేసుకోనున్నారు. ప.గో(D) పాలకొల్లుకు చెందిన లక్ష్మీఅంజన తాజా గ్రూప్-1 ఫలితాల్లో DSPగా ఎంపికయ్యారు. ఆమె తండ్రి దివాకర్ భీమవరం PSలో రైటర్ కాగా, తల్లి లత ప్రైవేటు టీచర్. లక్ష్మీఅంజన తాత కూడా కానిస్టేబుల్‌గా సేవలందించారు. కూతురు DSPగా ఎంపికై గర్వపడేలా చేసిందని పేరెంట్స్ ఆనందపడుతున్నారు. IPS అవ్వడమే టార్గెట్ అని లక్ష్మీఅంజన తెలిపారు.


