News October 6, 2025

సినీ ముచ్చట్లు

image

* పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘OG’ చిత్రం 11 రోజుల్లోనే రూ.308కోట్లు (గ్రాస్) రాబట్టింది
*ఈ నెల 10న జయశంకర్ తెరకెక్కించిన ‘అరి’, ‘శశివదనే’, ‘కానిస్టేబుల్‌’ చిత్రాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.
* మూవీ షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబర్ 25న విడుదలయ్యే అడివి శేష్ నటిస్తోన్న ‘డెకాయిట్’ మూవీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆ తేదీన రోషన్ మేకా నటించిన ‘ఛాంపియన్’ మూవీ రాబోతోంది.

Similar News

News October 6, 2025

ఇది మన రాజ్యాంగంపై దాడి: సోనియా గాంధీ

image

CJI BR గవాయ్‌పై ఓ లాయర్ షూ విసిరేందుకు యత్నించడంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘సుప్రీంకోర్టులోనే CJIపై దాడి చేయడాన్ని ఖండించేందుకు మాటలు చాలడం లేదు. ఇది ఆయనపైనే కాదు.. మన రాజ్యాంగంపై దాడి. దేశమంతా ఐక్యమై ఆయనకు అండగా నిలబడాలి’ అని ప్రకటన విడుదల చేశారు. ఇది న్యాయవ్యవస్థ గౌరవం, రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి అని, దేశంలో ఇలాంటి విద్వేషానికి చోటులేదని LoP రాహుల్ గాంధీ అన్నారు.

News October 6, 2025

ప్రభుత్వ పెద్దల అండతోనే కల్తీ మద్యం రాకెట్: YCP

image

AP: కల్తీ మద్యం రాకెట్‌తో ప్రభుత్వ పెద్దలకు లింకులున్నాయని YCP నేత జూపూడి ప్రభాకర్‌రావు ఆరోపించారు. ‘టీడీపీ నేతలే కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. అందుకోసమే ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం షాపుల పాలసీని రద్దుచేశారు. ప్రభుత్వ పెద్దల అండ లేకుండా ఇదంతా జరుగుతుందా? CBN దీనిపై వివరణ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. జిల్లాల్లో కల్తీ లిక్కర్ డెన్లను ఏర్పాటుచేసి ఆదాయాన్ని వాటాలుగా పంచుకుంటున్నారని దుయ్యబట్టారు.

News October 6, 2025

ఎన్నికల కమిషన్‌పై KTR వ్యంగ్యాస్త్రాలు

image

TG: బిహార్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించడంపై BRS నేత KTR వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘వెల్ డన్ ECI. ముందు SIRతో భారీ స్థాయిలో ఓట్లను తొలగించింది. ఆ తర్వాత ఎన్నికల ముందు 1.21 కోట్ల మంది మహిళా ఓటర్లకు <<17929774>>లంచం<<>> ఇచ్చేందుకు NDA ప్రభుత్వానికి అనుమతిచ్చింది. ఇప్పుడు ఫ్రీ & ఫెయిర్ ఎలక్షన్స్ అని చెబుతోంది. వెరీ వెల్ డన్’ అంటూ సెటైర్ వేశారు.