News July 18, 2024
మహేశ్ బాబుతో సినిమా.. కృష్ణవంశీ రియాక్షన్ ఇదే

దర్శకుడు కృష్ణవంశీ, మహేశ్ బాబు కాంబినేషన్లో వచ్చిన ‘మురారి’ మూవీ బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో సూపర్ స్టార్ తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టారు. తాజాగా ఓ ఫ్యాన్ మహేశ్తో మళ్లీ మూవీ ఎప్పుడు చేస్తారని దర్శకుడు కృష్ణవంశీని Xలో అడిగారు. దీనికి ఆయన ‘కష్టం అండి.. అతను అంతర్జాతీయ నటుడు’ అని బదులిచ్చారు. కాగా మహేశ్ పుట్టిన రోజు AUG 9న ‘మురారి’ రీరిలీజ్ కానుంది.
Similar News
News November 22, 2025
పెళ్లి చేసుకుంటున్నారా? శ్రీవారి కానుక అందుకోండిలా..

పెళ్లి చేసుకునేవారికి TTD ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. నూతన దంపతులకు వేంకటేశ్వరస్వామి ఆశీర్వచనంతో కూడిన మహా ప్రసాదం, కల్యాణ తలంబ్రాలు, కుంకుమ, కంకణాలను ఉచితంగా పంపిస్తుంది. అందుకోసం వివాహ తొలి శుభలేఖను కార్యనిర్వహణాధికారి, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, తిరుపతి చిరునామాకు పంపితే చాలు. వివాహానికి ఓ నెల ముందు పత్రిక పంపితే, స్వామివారి ప్రసాదం వివాహ సమయానికి అందుతుంది.

ఆవూ దూడా ఉండగా మధ్య గుంజ ఆర్చిందట

కుటుంబ సభ్యులు లేదా దగ్గరి బంధువులు తమలో తాము గొడవపడుతున్నప్పుడు, ఆ పోట్లాటలో మధ్యలో జోక్యం చేసుకున్న వ్యక్తి నష్టపోతాడు అనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఆవును, దూడను కట్టేసినప్పుడు వాటి మధ్య ‘గుంజ’ ఆధారంగా ఉంటుంది. ఆవు, దూడ అటూఇటూ లాక్కోవడం వల్ల వాటి బలం తట్టుకోలేక మధ్యలో ఉన్న ‘గుంజ’ విరిగిపోయినట్లుగా, ఇద్దరు వ్యక్తుల గొడవలో మూడో వ్యక్తి బలి అవుతాడని ఈ సామెత భావం.