News July 21, 2024

మెగాస్టార్‌తో సినిమా.. కృష్ణవంశీ ఏమన్నారంటే?

image

దర్శకుడు కృష్ణవంశీ Xలో అభిమానుల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా ప్లాన్ చేయమని ఆయనను ఓ నెటిజన్ కోరారు. ‘అన్నయ్యతో సినిమా అంటే ఆయనే డిసైడ్ చేయాలి. నాకు కూడా తనతో మూవీ చేయడం ఎప్పటికీ ఇష్టమే’ అని బదులిచ్చారు. ఇటీవల విడుదలైన సినిమాల్లో కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడిస్’ తనకు బాగా నచ్చిందని చెప్పారు.

Similar News

News December 21, 2024

సీఎం సోదరుడి వల్ల వ్యక్తి చనిపోతే ఎందుకు చర్యల్లేవు?: హరీశ్

image

TG: అబద్ధాల్లో CM రేవంత్ రెడ్డి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కుతారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఆయన చెప్పినవన్నీ అసత్యాలేనని మండిపడ్డారు. రుణమాఫీ, రైతు భరోసా, బోనస్‌పై క్లారిటీ ఇవ్వలేదన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధాకరమని హరీశ్ అన్నారు. కానీ సీఎం సోదరుడి వల్ల ఓ వ్యక్తి చనిపోతే చర్యల్లేవని, వాంకిడి హాస్టల్‌లో విషాహారం తిని బాలిక చనిపోతే మంత్రులెవరూ ఎందుకు పరామర్శించలేదని ఆయన ప్రశ్నించారు.

News December 21, 2024

శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది: కిమ్స్

image

TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యంపై కిమ్స్ ఆస్పత్రి బులిటెన్ విడుదల చేసింది. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్ సాయం లేకుండా శ్వాస తీసుకుంటున్నట్లు వివరించింది. అప్పుడప్పుడూ జ్వరం వస్తోందని పేర్కొంది. నిన్నటితో పోల్చితే ఇవాళ ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్యులు బులిటెన్‌లో వెల్లడించారు. అటు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు.

News December 21, 2024

కాసేపట్లో అల్లు అర్జున్ ప్రెస్‌మీట్

image

TG: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాత్రి 7 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టనున్నారు. సంధ్య థియేటర్ ఘటనపై ఇవాళ <<14942476>>అసెంబ్లీలో<<>> సీఎం రేవంత్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌పై ఆయనతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బన్నీ ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ ఏం మాట్లాడతారు? అనే విషయంపై ఆసక్తి నెలకొంది.