News June 13, 2024
రాజకీయాలకంటే సినిమాలే సులువు: కంగన

సినీరంగంతో పోలిస్తే రాజకీయాలు కష్టమని ఎంపీ కంగనా రనౌత్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘ఒకప్పుడు మా ముత్తాత ఎమ్మెల్యేగా చేశారు. రాజకీయాల్లోకి రావాలంటూ నాకూ ఆఫర్లు వచ్చాయి. సరైన సమయం కోసం ఆగాను. నటుల జీవితం ఒత్తిడిలేనిది. కానీ రాజకీయాల్లో ఎంతోమంది సమస్యలతో వస్తుంటారు. వాటిని జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉంటుంది’ అని తెలిపారు. హిమాచల్‌లోని మండి నుంచి ఆమె బీజేపీ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.
Similar News
News September 18, 2025
అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి: కలెక్టర్

అందరికీ విద్య, సౌకర్యాలు అందించడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్లు, మరమ్మతులు వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుపై పంచాయతీరాజ్, విద్యా, మహిళా సంక్షేమ, డీఆర్డీఓ, గిరిజన, టీజీడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు.
News September 18, 2025
OCT 1 నుంచి అమల్లోకి ఆన్లైన్ గేమింగ్ చట్టం: కేంద్రం

ఆన్లైన్ గేమింగ్‌కు సంబంధించిన కొత్త <<17486290>>రూల్స్<<>> అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే గేమింగ్ కంపెనీలు, స్టేక్ హోల్డర్స్‌తో పలుమార్లు చర్చలు జరిపామన్నారు. రూల్స్ అమల్లోకి వచ్చే ముందు గేమింగ్ ఇండస్ట్రీతో మరోసారి చర్చిస్తామన్నారు. ఆన్లైన్ మనీ గేమ్స్‌ను నిషేధించేందుకు కేంద్రం ఇటీవల ఆన్లైన్ గేమింగ్ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
News September 18, 2025
జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్.. అర్థమదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్‌లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?