News May 18, 2024

సినిమాలే ఈజీ: కంగనా రనౌత్

image

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని ‘మండి’ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నటి కంగనా రనౌత్ సినిమాల కంటే ఎన్నిక‌ల ప్ర‌చార‌మే కష్టమంటూ ట్వీట్ చేశారు. ‘వరుస రోడ్‌షోలు. సమావేశాలు. వందల కిలోమీటర్ల ప్రయాణం. నిద్రలేని రాత్రులు. సమయానికి తీసుకోని భోజనం. ఇవన్నీ చూశాక నాకు ఒకటి అర్థమైంది. వీటి ముందు సినిమా తీయడానికి పడే కష్టాలు ఒక జోక్ లాంటివి’ అంటూ పోస్ట్ పెట్టారు.

Similar News

News December 25, 2024

కొడుకు చనిపోయాడని హీరోయిన్ పోస్ట్.. నెటిజన్ల ఫైర్

image

‘ఈరోజు నా కొడుకు జోరో చనిపోయాడు. అతడు లేని నా లైఫ్ జీరో. నేను నా కుటుంబం షాక్‌లో ఉన్నాం’ అని హీరోయిన్ త్రిష Xలో పోస్ట్ చేశారు. దీంతో షాకైన ఫ్యాన్స్ ‘మీకు పెళ్లెప్పుడైంది? కొడుకు ఎప్పుడు పుట్టాడు?’ అని ఆరా తీశారు. తర్వాత ఆమె తన కుక్క చనిపోయిన ఫొటోలను షేర్ చేశారు. త్రిష చెప్పిన ‘కొడుకు’ కుక్క అని తెలియడంతో ‘ఆ విషయం ముందే చెప్పొచ్చుగా? ఎందుకు గందరగోళం సృష్టించడం?’ అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

News December 25, 2024

మరోసారి సత్యాగ్రహం: కాంగ్రెస్

image

నవ సత్యాగ్రహం పేరుతో మరోసారి సత్యాగ్రహ స్ఫూర్తిని రగిలించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ట్విటర్లో తెలిపింది. 1924, డిసెంబరు 26న కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీజీ పగ్గాలు స్వీకరించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని బెళగావిలో రేపు ‘నవ సత్యాగ్రహ బైఠక్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో ఎల్లుండి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపింది.

News December 25, 2024

మధుమేహులు ఇలా చేయడం మంచిది: నిపుణులు

image

డయాబెటిస్‌తో ఇబ్బందిపడేవారు జీవితంలో నడకను భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వారానికి 150 నిమిషాల నడక ఉండాలని పేర్కొంటున్నారు. ‘మధుమేహులు రోజుకు అరగంట చొప్పున వారంలో కనీసం 5 రోజులు నడవాలి. డయాబెటిస్‌ను అదుపులోకి తీసుకురావడంలో వాకింగ్ మంచి ఫలితాన్నిస్తుంది. ఒకేసారి అరగంట నడవలేకపోతే 10 నిమిషాల చొప్పున మూడు లేదా నాలుగుసార్లు నడుస్తున్నా ప్రయోజనం ఉంటుంది’ అని వివరిస్తున్నారు.