News July 8, 2024
శ్మశానంలో సమాధులకు సినిమాలు

థాయ్‌లాండ్‌లోని ఓ శ్మశానవాటికలో సమాధుల వద్ద కుర్చీలు వేసి సినిమాలు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. నఖోన్ రాట్చాసిమా ప్రావిన్స్‌లోని ఓ శ్మశానవాటికలో సినిమాలు వేశారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. JUNE 2-6 మధ్య ఇది జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా పూర్వీకుల ఆత్మల శాంతి కోసమే ఈ ప్రయత్నమని వారు చెబుతున్నారు. అదే దేశంలో ఇటీవల ఓ వ్యక్తి చనిపోయిన తన ప్రేయసిని వివాహం చేసుకోవడం గమనార్హం.
Similar News
News December 2, 2025
నేడు నెల్లూరు జిల్లా బంద్

వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇవాళ నెల్లూరు జిల్లా బంద్ జరగనుంది. పెంచలయ్య దారుణ హత్యకు నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి, మత్తు పదార్థాలను నిషేధించాలని, గంజాయి మాఫియా నుంచి ప్రజలను కాపాడాలని, పెంచలయ్య హత్యకు కారకులైన వారిని శిక్షించాలని జరుగుతున్న బంద్‌కి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిన్న నిందితురాలు కామాక్షికి చెందిన ఇళ్లను స్థానికులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని CSIR-<


