News January 19, 2025
ఫిబ్రవరిలో రిలీజయ్యే సినిమాలివే!

వచ్చే నెలలో నాగచైతన్య ‘తండేల్’ (ఫిబ్రవరి 7), అజిత్ ‘పట్టుదల'(ఫిబ్రవరి 6)తో పాటు పలు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ఫిబ్రవరి 14న విశ్వక్ సేన్ ‘లైలా’, కిరణ్ అబ్బవరం ‘దిల్రూబా’, బ్రహ్మానందం, ఆయన తనయుడు గౌతమ్ నటించిన ‘బ్రహ్మా ఆనందం’ విడుదలవుతున్నాయి. 21న సందీప్ కిషన్ ‘మజాకా’, తమిళ డబ్బింగ్ సినిమా ‘డ్రాగన్’ రిలీజ్ కానున్నాయి. వీటిలో మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?
Similar News
News November 1, 2025
NITCON లిమిటెడ్ 143 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

NITCON లిమిటెడ్ 143 డేటా ఎంట్రీ ఆపరేటర్(DEO), MTS పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హత గల అభ్యర్థులు నవంబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. DEO పోస్టులకు స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, MTS పోస్టులకు షార్ట్ లిస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://nitcon.org/
News November 1, 2025
శనివారం రోజున చేయకూడని పనులు

శనివారం నాడు కొన్ని వస్తువులను ఇంటికి తీసుకెళ్లడం, కొన్ని పనులు చేయడం అశుభమని భావిస్తారు. అవి..
☞ శనివారం నాడు నువ్వుల నూనె, తోటకూర, చెప్పులు కొనుగోలు చేయకూడదు.
☞ ఉప్పు, నల్ల మినుములను (నల్ల మినప్పప్పు) ఇంటికి తీసుకురావడం శుభదాయకం కాదు.
☞ శనివారం బొగ్గులు, ఇనుము కూడా కొనకపోవడం ఉత్తమం.
☞ ఈ నియమాలు పాటిస్తే శని దేవుని ఆగ్రహం తగ్గుతుందని, అదృష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
News November 1, 2025
పోలవరం నిర్వాసితులకు ₹1,000 కోట్ల పరిహారం.. నేడే పంపిణీ

AP: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పునరావాసం కింద మరో రూ.వెయ్యి కోట్లను వారికి చెల్లించనుంది. నేడు ఏలూరు జిల్లా వేలేరుపాడులో జరిగే కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు వారికి చెక్కులను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా తెరిచిన ఖాతా నుంచి లబ్ధిదారులకు సొమ్ము జమ కానుంది. ఈ ఏడాది జనవరిలో కూడా ప్రభుత్వం రూ.900 కోట్లను నిర్వాసితులకు విడుదల చేసింది.


