News November 13, 2024
MP అవినాశ్ రెడ్డి PA కోసం గాలింపు

వర్రా రవీందర్ రెడ్డి కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. కడప MP అవినాశ్ రెడ్డి PA రాఘవ రెడ్డి సూచనలతోనే తాను అసభ్యకర పోస్టులు పెట్టినట్లు వర్రా వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. దీంతో రాఘవ రెడ్డిని విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గత 4 రోజుల నుంచి రాఘవ రెడ్డి అజ్ఞాతంలో ఉండటంతో ఆయన స్వగ్రామం అంబకపల్లెపై పోలీసులు నిఘా ఉంచారు. పులివెందుల, లింగాల మండలాల్లో ఆయన కోసం గాలిస్తున్నారు.
Similar News
News September 13, 2025
కడప: RIMS పూర్వ వైద్యాధికారులపై విచారణకు ఆదేశాలు

కడప RIMSలో గతంలో పనిచేసిన వైద్యాధికారులపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్లు సురేశ్వర రెడ్డి, జొన్న నగేశ్, షేక్ మహబూబ్ బాషా, సంజీవయ్య, సత్యనారాయణపై విచారణకు అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరావు, కడప ఏసీబీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసుల రెడ్డిలను విచారణాధికారులుగా నియామకం చేశారు.
News September 13, 2025
కడప జిల్లా ఎస్పీ బదిలీ

కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ఎస్పీగా నిచికేత్ ఐపీఎస్ను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ అశోక్ కుమార్ను ఎక్కడికి బదిలీ చేశారనేది అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది.
News September 13, 2025
రూ.1.91 కోట్లు పలికిన ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ టెండర్

ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ నిర్వహణను బాక్స్ టెండర్లో రూ.1.91,44,000లకు శివకుమార్ దక్కించుకున్నాడు. శుక్రవారం ప్రొద్దుటూరులోని మున్సిపల్ కార్యాలయంలో ఎగ్జిబిషన్ టెండర్లను కమిషనర్ రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు నిర్వహించారు. ఓపెన్, బాక్స్ టెండర్లను నిర్వహించారు. ఓపెన్ టెండర్లో సాకే పెద్దిరాజు రూ.1.76 కోట్లకు, బాక్స్ టెండర్లో శివకుమార్ రూ.1.91 కోట్లకు బిడ్ వేశారు.