News November 13, 2024
MP అవినాశ్ రెడ్డి PA కోసం గాలింపు
వర్రా రవీందర్ రెడ్డి కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. కడప MP అవినాశ్ రెడ్డి PA రాఘవ రెడ్డి సూచనలతోనే తాను అసభ్యకర పోస్టులు పెట్టినట్లు వర్రా వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. దీంతో రాఘవ రెడ్డిని విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గత 4 రోజుల నుంచి రాఘవ రెడ్డి అజ్ఞాతంలో ఉండటంతో ఆయన స్వగ్రామం అంబకపల్లెపై పోలీసులు నిఘా ఉంచారు. పులివెందుల, లింగాల మండలాల్లో ఆయన కోసం గాలిస్తున్నారు.
Similar News
News December 14, 2024
ఓబులవారిపల్లి: హత్య కేసు నిందితులు అరెస్ట్
ఓబులవారిపల్లి మండలం మంగంపేట 10వ వీధికి చెందిన గట్టు ఆంజనేయులు(57) హత్య కేసులో నిందితుడు అయ్యలరాజుపల్లికి చెందిన అంజనేయ ప్రసాద్‌కు సహకరించిన చంద్రకళ, సింహాద్రిని కూడా అరెస్టు చేశామని రాజంపేట డీఎస్పీ సుధాకర్ తెలిపారు. శుక్రవారం కోడూరు స్టేషన్‌లో మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టి, వివరాలు వెల్లడించారు. యూట్యూబర్ అయిన నిందితుడు సానుభూతి పొందడానికి వీడియో రిలీజ్ చేశారని తెలిపారు.
News December 14, 2024
రాష్ట్రంలో రాజంపేట టాప్
కోటి సభ్యత్వాలే లక్ష్యంగా టీడీపీ ముందుకెళ్తోంది. రూ.100 కడితే రూ.5 లక్షల బీమా ఉండటంతో పలువురు టీడీపీ సభ్యత్వాలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో నిన్నటి వరకు మొత్తం సభ్యత్వాల సంఖ్య 71 లక్షలు దాటింది. ఇందులో రాజంపేట టాప్‌లో ఉంది. ఆ తర్వాతే సీఎం సొంత నియోజకవర్గం కుప్పం ఉండటం గమనార్హం.
News December 13, 2024
జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య: YS జగన్
కడప జిల్లా వేముల మండల కేంద్రంలో నీటి సంఘాల ఎన్నికల్లో అధికార టీడీపీ నేతల దారుణాలను ప్రపంచానికి చూపిస్తున్న జర్నలిస్ట్‌లపై దాడి హేయమైన చర్యని YS జగన్ అభిప్రాయపడ్డారు. X వేదికగా ఈ దాడిని ఆయన శుక్రవారం తీవ్రంగా ఖండించారు. మీడియాపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు. నిజాలు నిర్భయంగా వెలికితీస్తున్న మీడియా గొంతు నొక్కేయాలనుకోవడం కూటమి ప్రభుత్వం దుర్మార్గపు చర్య అన్నారు.