News July 1, 2024

MP లావు కృష్ణ దేవరాయలు నేటి పర్యటన వివరాలు

image

నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీ కృష్ణ దేవరాయలు పర్యటన వివరాలను ఆయన కార్యాలయ సిబ్బంది తెలియజేశారు. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున నరసరావుపేట ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీనేత లావు శ్రీ కృష్ణదేవరాయలు ఢిల్లీ వెళ్తున్నారన్నారు. సోమవారం నుంచి గురువారం వరకు MP లావు అందుబాటులో ఉండరని పార్లమెంటు పరిధిలోని ప్రజలందరూ గమనించవలసిందిగా తెలిపారు.

Similar News

News December 7, 2025

గుంటూరు జిల్లాలో 600కు పైగా రోడ్డు ప్రమాదాలు

image

ఈ ఏడాది గుంటూరు జిల్లాలో 600కు పైగా రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. అతివేగం, మద్యం తాగి డ్రైవింగ్, హెల్మెట్/సీట్ బెల్ట్ ధరించకపోవడం ప్రధాన కారణాలుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం 6-9, మధ్యాహ్నం 3-6 సమయాల్లో ప్రమాదాలు అధికంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మోర్త్ దేశవ్యాప్తంగా అత్యధికంగా ప్రమాదాల జరుగుతున్న టాప్ 100 జిల్లాల జాబితాలో గుంటూరు 71వ స్థానంలో నిలిచింది.

News December 7, 2025

మహానటి సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మాణం: MP బాలశౌరి

image

మహానటి సావిత్రి పేరుతో ఆమె జన్మస్థలమైన గుంటూరు (D) తాడేపల్లి (M) చిర్రావూరులో కళ్యాణ మందిరం నిర్మించనున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. NTPC వారి సీఎస్ఆర్ నిధులు కింద రూ.2 కోట్లు మంజూరు చేశారన్నారు. గతంలో తాను తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో చిర్రావూరులో సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మించాలని సంకల్పించినట్లు ఆమె 90వ జయంతి సందర్భంగా బాలశౌరి తెలిపారు.

News December 6, 2025

దాతలు సమాజానికి నిజమైన స్ఫూర్తిప్రదాతలు: కలెక్టర్

image

విదేశాల్లో స్థిరపడి మాతృభూమిపై మమకారంతో ప్రజాసేవకు ముందుకొస్తున్న దాతలు నిజమైన స్ఫూర్తిప్రదాతలు అని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. శనివారం జీజీహెచ్‌లో ఆల్ ఫ్రెస్కో యాంపీ థియేటర్ ఆమె ప్రారంభించారు. సమాజ అభివృద్ధిలో దాతలను భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం పీ4 కార్యక్రమాన్ని సైతం అమలు చేస్తుందని తెలిపారు. జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.