News February 2, 2026

MP అవినాశ్ రెడ్డి అసంతృప్తి

image

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను పూర్తిగా నిరాశ పరిచిందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు, జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి కీలక పథకాలకు కేటాయింపులు తగ్గించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకానికి గతేడాది రూ. 88,000 కోట్లు కేటాయించగా, ఈసారి కేవలం రూ30,000 కోట్లే కేటాయించడం దారుణమన్నారు.

Similar News

News February 9, 2026

ఆర్థిక అక్షరాస్యత పై విస్తృతంగా అవగాహన కల్పించండి: కలెక్టర్

image

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలపై ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌తో కలసి ఆవిష్కరించారు. సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

News February 9, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.1,650
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.1,476
* వెండి 10 గ్రాముల ధర: రూ.2,730.

News February 9, 2026

ప్రొద్దుటూరు అభివృద్ధిపై రేపు జిల్లా కలెక్టర్ సమీక్ష

image

ప్రొద్దుటూరు నియోజకవర్గం అభివృద్ధిపై మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ శ్రీధర్ అధ్యక్షతన సమీక్ష ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సూచన మేరకు సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. నియోజకవర్గంలోని సంబంధిత ప్రభుత్వ అధికారులు ప్రగతి నివేదికలతో సమావేశానికి హాజరు కావాలని డీఆర్ఓ ఆదేశించారు.