News April 2, 2024

MP ఎన్నికలు: మెదక్‌లో వీళ్లు ఓటేస్తే విజయమే..!

image

పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో నియోజకవర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది. మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో మొత్తం 18,19,397 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 19 ఏండ్ల వయస్సు ఓటర్లు 53,458 మంది, 30 సం.లోపు 3,96,228 మంది, 40 సం.లోపు ఉన్నవారు 5,02,897 మంది ఉన్నారు. నాలుగు పదుల వయస్సు దాటనివారు మొత్తం 9.53 లక్షల మంది ఉన్నారు. అభ్యర్థుల గెలుపు ఓటముల్లో యువతే కీలకం కానుంది. మరి మీ ఓటు ఎటువైపు?

Similar News

News April 2, 2026

మెదక్: ‘మీ సేవ’ ఛార్జీల పెంపు: అదనపు కలెక్టర్

image

‘మీ సేవ’ కేంద్రాల ఛార్జీలు పెంచినట్లు మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. కనీస ఛార్జీ రూ.35 నుంచి రూ.62కి పెరిగిందని, A కేటగిరీకి రూ.62, B కేటగిరీ సేవలకు రూ.80గా నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై మీసేవ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. నిర్ణయించిన ధరలకు మించి వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 3వ తేదీన మెయింటెనెన్స్ డే కారణంగా కేంద్రాలు పనిచేయవన్నారు.

News April 2, 2026

మనోహరాబాద్: సబ్బుపై హనుమాన్ రూపం

image

హనుమాన్ జయంతి సందర్భంగా చిత్రకారుడు సబ్బుపై హనుమాన్ చిత్రం చెక్కారు. మనోహరాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిత్ర లేఖనం ఉపాధ్యాయుడు బ్రహ్మచారి సబ్బుపై వీర హనుమాన్ రూపాన్ని చెక్కి తన భక్తిని చాటుకున్నారు. చిత్ర లేఖనంతో విద్యార్థుల భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఉపాధ్యాయుడిని పలువురు అభినందించారు.

News April 2, 2026

మెదక్: గడ్డిమందు కొనుగోలు, వినియోగం చేయరాదు: వ్యవసాయ అధికారి

image

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గడ్డి మందు విక్రయాలు, నిల్వలు, వినియోగంపై 60 రోజుల నిషేధం విధించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ తెలిపారు. ఈ నిషేధం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. రైతులు గడ్డి మందు కొనుగోలు, వినియోగం చేయరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి అమ్మకాలు జరిపే ఫర్టిలైజర్ దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.