News June 4, 2024
MP: 17 స్థానాల్లో బీజేపీ దూకుడు.. శివరాజ్, సింధియా ముందంజ

మధ్యప్రదేశ్‌లో వార్ వన్‌సైడ్ కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్‌లో ఎన్డీయే అత్యధిక స్థానాల్లో దూసుకుపోతోంది. మొత్తం 29 నియోజకవర్గాల్లో బీజేపీ 17 స్థానాల్లో అదరగొడుతోంది. విపక్ష ఇండియా కూటమి రెండిట్లో ఆధిక్యంలో ఉంది. గుణలో జ్యోతిరాధిత్య సింధియా, విదిశాలో శివరాజ్ సింగ్ చౌహాన్ దూసుకెళ్తున్నారు. చింద్వాడాలో నకుల్ కమల్‌నాథ్ (కాంగ్రెస్), బాలాఘాట్‌లో అశోక్ సింగ్ (కాంగ్రెస్) పోటీనిస్తున్నారు.
Similar News
News November 28, 2025
పల్నాడు జిల్లాలో మున్సిపాలిటీలకు పుడా నిధులు

పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల అభివృద్ధికి రూ. 2.60 కోట్లు నిధులు కేటాయించింది. నరసరావుపేట మున్సిపాలిటీకి రూ.25 లక్షలు, దాచేపల్లి రూ.25 లక్షలు, గురజాల రూ.25 లక్షలు, మాచర్ల రూ.45 లక్షలు, పిడుగురాళ్ల రూ.50 లక్షలు, వినుకొండ రూ.40 లక్షలు, చిలకలూరిపేటకు రూ.50 లక్షలు కేటాయించారు. ఈ నిధులను మున్సిపాలిటీలలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి వినియోగించనున్నారు.
News November 28, 2025
DEC 13న HYDకు మెస్సీ: CM రేవంత్

TG: తన G.O.A.T. టూర్ లిస్టులో హైదరాబాద్ కూడా యాడ్ అయ్యిందని ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్ స్పందించారు. ‘డిసెంబర్ 13న హైదరాబాద్‌కి మెస్సీని స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నాను. మా గడ్డ మీద మీలాంటి ఫుట్‌బాల్ స్టార్‌ని చూడాలని కలలుగన్న ప్రతి అభిమానికి ఇది ఎగ్జైటింగ్ మూమెంట్. మీకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ సగర్వంగా సిద్ధమైంది’ అని ట్వీట్ చేశారు.
News November 28, 2025
భారత్ తగ్గేదే లే.. GDP వృద్ధి రేటు 8.2%

భారత జీడీపీ అంచనాలను మించి రాణించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో వృద్ధి రేటు 8.2%గా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 5.6%గా ఉంది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఈ నంబర్లను రిలీజ్ చేసింది. అమెరికా టారిఫ్స్ విధించినా భారత ఆర్థిక రంగం మెరుగ్గా రాణించడం విశేషం.


