News May 5, 2024
ట్రాఫిక్ రూల్స్ పాటించని ఎంపీ అభ్యర్థులు.. పెండింగ్‌లో చలాన్స్!

TG: MP అభ్యర్థులు ఎన్నికల అఫిడవిట్‌లను సమర్పించే ముందు అన్ని బకాయిలను చెల్లించాలి. కానీ ప్రధాన పార్టీలకు చెందిన కొందరు ట్రాఫిక్ చలాన్లు చెల్లించలేదు. ఉల్లంఘనలు జరిగినప్పుడు తాము డ్రైవింగ్ చేయలేదని వారు వాదించే ఛాన్సుంది. కొప్పుల ఈశ్వర్-BRS(₹6210), నీలం మధు-INC(₹3305), సురేశ్ షెట్కార్-INC(₹3105), బూర నర్సయ్య-BJP(₹3105, ₹1035), గోమాస శ్రీనివాస్-BJP (₹2070), పద్మారావు-BRS(₹1035) చెల్లించాల్సి ఉంది.
Similar News
News March 18, 2026
UG, PG విద్యార్థుల కోసం 39 కొత్త కోర్సులు

TG: రాష్ట్రంలోని విద్యార్థుల కోసం 39 కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి వెల్లడించారు. UGలో 19, PGలో 10 కోర్సులు, AEDP(అప్రెంటిస్ ఎనేబుల్డ్ డిగ్రీ ప్రోగ్రామ్స్)లో భాగంగా మరో 10 కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. 2030 నాటికి వివిధ రంగాల్లో 20L ఉద్యోగాలు ఏర్పడే అవకాశముందని, వాటిని సాధించేలా యువతను సిద్ధం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.
News March 18, 2026
24 గంటల్లోనే అణుబాంబు వేసేవారు: ట్రంప్

ఇరాన్‌పై దాడి చేయకపోయి ఉంటే వారు అణుబాంబును తయారు చేసుకునేవారని ట్రంప్ అన్నారు. అదే జరిగితే 24 గంటల్లోనే దాన్ని ప్రయోగించి ఉండేవారని పేర్కొన్నారు. ఇది కేవలం పశ్చిమాసియాలోనే గాక యూరప్ వరకు పాకి ఉండేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు అమెరికా నేషనల్ కౌంటర్‌టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్ <<19409994>>రాజీనామాపై<<>> స్పందిస్తూ.. భద్రతాపరమైన విషయంలో ఆయన చాలా వీక్ అని, వెళ్లిపోవడమే మంచిదైందని వ్యాఖ్యానించారు.
News March 17, 2026
IPL-2026: చెన్నై తుది జట్టు ఇదేనా?

IPL-2026: గత కొన్ని సీజన్లతో పోలిస్తే ఈసారి చెన్నై జట్టులో యువరక్తం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో తుది జట్టు ఎలా ఉండనుందనే ఆసక్తి నెలకొంది. క్రికెట్ విశ్లేషకుల అంచనా ఇది..
CSK: ఆయుష్ మాత్రే, సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(C), బ్రెవిస్, కార్తీక్ శర్మ, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, ధోనీ, నాథన్ ఇల్లిస్, నూర్ అహ్మద్, హెన్రీ/ఖలీల్ అహ్మద్.


