News October 5, 2024

గుర్రంపై వచ్చి ఓటేసిన ఎంపీ జిందాల్

image

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు BJP MP నవీన్ జిందాల్ గుర్రంపై పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఇది శుభమని నమ్మడమే కాక ప్రజల్లో ఓటుపై అవగాహన కల్పించేందుకే ఇలా చేసినట్లు ఆయన వివరించారు. ‘ప్రజల్లో చాలా చైతన్యం కనిపిస్తోంది. వారు బీజేపీకి ఓటేసి తమ దీవెనల్ని అందిస్తారని నమ్మకంతో ఉన్నాం. నయబ్ సింగ్ మళ్లీ CM అవుతారు’ అని పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో 90 స్థానాలకు ఈరోజు ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతోంది.

Similar News

News November 17, 2025

రూ.లక్ష కోట్లకు Groww

image

స్టాక్ బ్రోకింగ్ సంస్థ Groww పేరెంట్ కంపెనీ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో అదరగొట్టింది. వరుసగా నాలుగు రోజులు లాభాలు సాధించింది. ఇవాళ షేర్ వాల్యూ మరో 13 శాతం పెరిగి అత్యధికంగా రూ.169.79కి చేరింది. ఇష్యూ ధర రూ.100తో పోలిస్తే దాదాపు 70 శాతం పెరుగుదల నమోదైంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.05 లక్షల కోట్లను తాకింది.

News November 17, 2025

OFFICIAL: ఎల్లుండి అకౌంట్లలోకి రూ.7,000

image

AP: ఈ నెల 19న పీఎం కిసాన్‌తో పాటు అన్నదాత సుఖీభవ స్కీమ్‌నూ అమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రెండో విడతలో రాష్ట్ర వాటా రూ.5వేలు, కేంద్రం వాటా రూ.2వేలు కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ నిధులను విడుదల చేస్తారన్నారు. మొత్తంగా 46,62,904 మంది రైతులకు రూ.3,077 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని వివరించారు.

News November 17, 2025

సౌదీ ప్రమాదంలో భారతీయులు చనిపోవడం బాధాకరం: మోదీ

image

సౌదీ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మదీనాలో జరిగిన ఈ ఘటనలో భారత పౌరులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం & జెడ్డాలోని కాన్సులేట్ సాధ్యమైనంత సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. సౌదీ అధికారులతో సమీక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.