News October 23, 2025
కేసీఆర్‌పై MP మల్లు రవి ఆగ్రహం

TG: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను BRS చీఫ్ KCR <<18084451>>రౌడీ షీటర్<<>> అనడంపై MP మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘BC బిడ్డను రౌడీ షీటర్ అని అవమానిస్తారా? నవీన్ యాదవ్ మంచి విద్యావంతులు, పేదలకు సాయం చేసే గుణమున్నవాడు. ఆయనపై మీ అగ్రవర్ణ అహంకారాన్ని చూపిస్తారా. కేసీఆర్ బీసీలందరినీ అవమానించినట్లే. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు’ అని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News October 24, 2025
ఢిల్లీలో తొలి కృత్రిమ వర్షం.. టెస్ట్ సక్సెస్

దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారి కృత్రిమ వర్షానికి ఏర్పాట్లు పూర్తయినట్లు సీఎం రేఖాగుప్తా తెలిపారు. బురారి ప్రాంతంలో ఇవాళ ప్రయోగాత్మక పరీక్ష సక్సెస్ అయినట్లు పేర్కొన్నారు. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 29న ఢిల్లీలో కృత్రిమ వర్షానికి అవకాశముందన్నారు. ఇది వాయు కాలుష్యంపై పోరులో శాస్త్రీయ పద్ధతిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఈ ఆవిష్కరణతో వాతావరణాన్ని సమతుల్యంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
News October 24, 2025
ఇజ్రాయెల్‌ను పరోక్షంగా హెచ్చరించిన ట్రంప్

పాలస్తీనాలో భాగమైన వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకుంటే ఇజ్రాయెల్ తమ మద్దతును పూర్తిగా కోల్పోతుందని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోదనే విషయమై తాను అరబ్ దేశాలకు మాట ఇచ్చానని పేర్కొన్నారు. అటు వెస్ట్ బ్యాంక్ స్వాధీనానికి అంగీకారం తెలిపేలా బిల్లులను ఇజ్రాయెల్ పార్లమెంట్ తీసుకొచ్చింది. కాగా ఈ వెస్ట్ బ్యాంక్‌ను యూదుల చారిత్రాక కేంద్రంగా ఇజ్రాయెల్ భావిస్తోంది.
News October 24, 2025
అక్టోబర్ 24: చరిత్రలో ఈరోజు

1930: నిర్మాత చవ్వా చంద్రశేఖర్ రెడ్డి జననం
1966: నటి నదియా జననం
1980: నటి లైలా జననం
1985: బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త లాస్లో బైరో మరణం
2015: హాస్య నటుడు మాడా వెంకటేశ్వరరావు మరణం
2017: దక్షిణ భారత సినిమా దర్శకుడు ఐ.వి.శశి మరణం
✿ఐక్యరాజ్య సమితి దినోత్సవం
✿ప్రపంచ పోలియో దినోత్సవం