News November 4, 2024
కేంద్రమంత్రితో MP శ్రీకృష్ణదేవరాయలు భేటీ

AP: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డాతో TDP MP లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. NIPER ఏర్పాటుకు భూమితో పాటు అన్ని విధాలుగా సహకరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని నడ్డాను కోరారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి ఆరోగ్య పరీక్షలు చేసే కేంద్రాలను ఉత్తరాంధ్రలో లేదా రాయలసీమలో ఏర్పాటు చేయాలని విన్నవించారు. రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెంచేలా వెసులుబాటు కల్పించాలని కోరారు.
Similar News
News February 6, 2026
అవకాశం వచ్చినప్పుడు గెలిచి తీరాల్సిందే: సీఎం

TG: మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ పర్యటనలో ఉన్న ఆయన కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. మళ్లీ మళ్లీ పోటీ చేసే అవకాశం అందరికీ రాదని, పార్టీ టికెట్ ఇచ్చినపుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు విద్వేషాలు రెచ్చగొడతాయని, మనం చేసిన అభివృద్ధిని చెప్పుకోవాలని సూచించారు.
News February 6, 2026
బంగ్లాలో ఘర్షణలు.. యూనస్ ఇంటి బయటే..!

ఎన్నికలకు 6 రోజుల ముందు బంగ్లాలో ఘర్షణలు చెలరేగాయి. దేశ సలహాదారు యూనస్ నివాసం ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నేషనల్ పే స్కేల్ అమలు చేయాలని దేశంలోని ఉద్యోగులు ఢాకాలోని షహీద్ మినార్ నుంచి యూనస్ నివాసానికి ర్యాలీగా వచ్చారు. లోనికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి, వాటర్ క్యానన్స్, టియర్ గ్యాస్, సౌండ్ గ్రనేడ్లు ప్రయోగించారు. ఢాకా అంతటా భారీగా బలగాలను మోహరించారు.
News February 6, 2026
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. ఇకనైనా మారండి!

ఢిల్లీలోని జనక్‌పురిలో జలమండలి తవ్విన లోతైన గుంతలో పడి ఓ బైకర్ మృతి చెందాడు. కనీస హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు, లైట్లు లేకపోవడమే ఈ ఘోరానికి కారణం. ప్రజల నుంచి రోడ్ ట్యాక్స్, జీఎస్టీలు వసూలు చేస్తున్న ప్రభుత్వాలు కనీస భద్రత కల్పించడంలో విఫలమవుతున్నాయనే చర్చ జరుగుతోంది. ప్రాణాలు పోతుంటే అధికారులు ఇంకెన్నాళ్లు నిర్లక్ష్యంగా ఉంటారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి.


