News April 29, 2024

బీజేపీలో చేరిన ఎంపీ వెంకటేశ్ నేత

image

TG: పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత బీజేపీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఇవాళ బీజేపీలో చేరారు.

Similar News

News January 31, 2026

న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలకు అప్లై చేశారా?

image

న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(<>NSIL<<>>)లో 16 కన్సల్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి CA/ICWA, డిగ్రీ, MBA, BE/BTech, MSW, MA, MTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. యంగ్ కన్సల్టెంట్‌కు గరిష్ఠ వయసు 30ఏళ్లు కాగా, కన్సల్టెంట్‌కు 35, Sr.కన్సల్టెంట్‌కు 45ఏళ్లు. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు హార్డ్ కాపీని FEB 10వరకు పంపాలి. సైట్: www.nsilindia.co.in

News January 31, 2026

శనివారం రోజున శ్రీవారి పూజ ఎలా చేయాలి?

image

ఉదయాన్నే స్నానమాచరించి, నుదుట తిరునామం ధరించాలి. పూజగదిని రంగవల్లికలు, పుష్పాలతో అలంకరించి వేంకటేశ్వర స్వామిని శ్రీహరిగా భావించాలి. స్వామికి తులసి దళాలతో అర్చన చేసి, పాలు, పండ్లు లేదా చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఉదయం, సాయంత్రం ధూపదీపాలతో స్వామిని కొలవాలి. ఈ రోజు శ్రీనివాసుని కథా పారాయణం చేయడం వల్ల పనుల్లో జాప్యాలు తొలగి, గోవిందుడి కృపాకటాక్షాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

News January 31, 2026

కోళ్లలో కొక్కెర వ్యాధి లక్షణాలు

image

కొళ్లలో కొక్కెర వ్యాధి చాలా ప్రమాదకరమైనది. దీన్ని రాణిఖేత్ డిసీజ్ అని కూడా అంటారు. ఇది సోకిన కోడి ముక్కు నుంచి చిక్కని ద్రవం కారుతుంది. పచ్చటి, తెల్లటి నీళ్ల విరేచనాలు అవుతాయి. కాళ్లు, మెడ, రెక్కల్లో పక్షవాతం, మెడ వంకర్లు తిరిగి, రెక్కలు, ఈకలు ఊడిపోతాయి. శ్వాస సమయంలో శబ్దం వస్తుంది. తోలు గుడ్లు పెడతాయి. వ్యాధి తీవ్రమైతే పల్టీలు కొడుతూ వ్యాధి సోకిన 3 నుంచి 4 రోజుల్లో కోళ్లు మరణిస్తాయి.