News April 8, 2024

చంద్రబాబు ‘సూపర్ సిక్స్’పై ఎంపీ VSR సెటైర్లు

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి Xలో సెటైర్లు వేశారు. ‘చంద్రబాబు చెబుతోన్న సూపర్ సిక్స్ అనేవి సంక్షేమ పథకాలు కావు. పొరపాటున గెలిస్తే తాను, తన పుత్రరత్నం లోకేశ్, వదిన పురందీశ్వరి, యనమల రామకృష్ణుడు, పొంగూరు నారాయణ, నిమ్మగడ్డ రమేశ్‌ చక్రం తిప్పుతారని సంకేతం ఇస్తున్నారు. వీళ్లు ఆరుగురు బాగు పడితే చాలనేది బాబు కోరిక’ అని పేర్కొన్నారు.

Similar News

News October 9, 2024

JOE ROOT: ‘గే’ అని గేలి చేసినా..!

image

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తున్నారు. గత నాలుగేళ్లలో అత్యుత్తమ ఫామ్ ప్రదర్శించి ఏకంగా 18 సెంచరీలు బాదారు. కాగా రూట్ 2021కు ముందు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. తరచూ ఆయనను ప్రత్యర్థులు ‘గే’ అంటూ ఎగతాళి చేసేవారు. ఆయన వాటినేం పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టేవారు. అతడిని ‘గే’ అని పిలిచినందుకు వెస్టిండీస్ బౌలర్ గాబ్రియేల్ 4 మ్యాచ్‌ల నిషేధం కూడా ఎదుర్కొన్నారు.

News October 9, 2024

3 రోజుల్లోనే ఖాతాల్లోకి డబ్బులు: మంత్రి

image

TG: ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ(D) అర్జాలబావి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకే రూ.500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. రుణమాఫీ కాని రైతులకు వారం రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు.

News October 9, 2024

కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్

image

రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. ‘ప్రొటీన్ స్ట్రక్చర్ ప్రెడిక్షన్‌’కు గాను డేమిస్ హసాబిస్, జాన్ ఎం.జంపర్‌‌లకు, ‘కంప్యూటేషనల్ ప్రొటీన్ డిజైన్’కు గాను డేవిడ్ బెకర్‌కు సంయుక్తంగా నోబెల్ ప్రైజ్ వచ్చింది.