News November 13, 2024

MP అవినాశ్ రెడ్డి PA కోసం గాలింపు

image

వర్రా రవీందర్ రెడ్డి కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. కడప MP అవినాశ్ రెడ్డి PA రాఘవ రెడ్డి సూచనలతోనే తాను అసభ్యకర పోస్టులు పెట్టినట్లు వర్రా వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. దీంతో రాఘవ రెడ్డిని విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గత 4 రోజుల నుంచి రాఘవ రెడ్డి అజ్ఞాతంలో ఉండటంతో ఆయన స్వగ్రామం అంబకపల్లెపై పోలీసులు నిఘా ఉంచారు. పులివెందుల, లింగాల మండలాల్లో ఆయన కోసం గాలిస్తున్నారు.

Similar News

News December 26, 2024

కడప: చిన్నారిని ఒంటరిని చేసిన రోడ్డు ప్రమాదం

image

ఉమ్మడి కడప జిల్లాలో ఓబుళవారిపల్లెలో ఆదివారం ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నరసింహ(40), భార్య సుజాత (35), బాల ముణిచరణ్(8) మృతిచెందగా.. చిన్నారి ప్రాణాలతో బయటపడింది. చిన్నవయస్సులోనే ఆ చిన్నారి కుటుంబాన్ని కోల్పోవడం అందరినీ కలిచివేస్తోంది. కాగా.. వీరంతా బైక్‌పై వైకోటలో సుజాత అమ్మగారింటికి వెళ్లి వస్తుండగా.. వారిని రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద ఆటో ఢీకొట్టింది.

News December 25, 2024

పుల్లంపేట: మూడు రోజుల వ్యవధిలో తల్లి, తండ్రి, కొడుకు మృతి

image

పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజంపేట మండలం భువనగిరి పల్లికి చెందిన <<14954606>>భార్యాభర్తలు<<>> మృతి చెందిన విషయం విదితమే. ఆ ఘటనలో గాయపడిన వేలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి కొడుకు బాల మణిచరణ్ బుధవారం ఉదయం మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ ప్రమాదంలో గాయపడ్డ వారి కుమార్తె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News December 25, 2024

Photo Of The Day: జగన్‌కు ప్రేమతో..!

image

మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటనలో ఆసక్తికర దృశ్యం జరిగింది. స్థానిక సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆయన తన తల్లి విజయమ్మతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం విజయమ్మ ఆప్యాయంగా జగన్‌ను ముద్దాడింది. ఇదే ‘ఫొటో ఆప్ ది డే’ అంటూ వైసీపీ అభిమానులు ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు.