News July 10, 2025

లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకూ అవకాశమివ్వాలి: రఘునందన్

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో లోక్‌సభ MPలకూ భాగస్వామ్యం కల్పించాలని CM రేవంత్‌ను BJP MP రఘునందన్ రావు కోరారు. ‘లబ్ధిదారుల ఎంపికలో స్థానిక MLAలకు 40% కోటా కేటాయించడం ప్రశంసనీయం. MLAల తరహాలోనే ప్రజల మద్దతుతో గెలిచిన 17 మంది MPలకూ 40% కోటా కేటాయించండి. దీని వల్ల కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో అమలవుతున్న పథకంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది’ అని బహిరంగ లేఖ రాశారు.

Similar News

News July 11, 2025

కానిస్టేబుల్ ఫైనల్ స్కోర్ కార్డ్ విడుదల

image

AP: పోలీస్ కానిస్టేబుల్ ఫైనల్ స్కోర్ కార్డు విడుదలైంది. 6,100 పోస్టులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ జూన్‌ 1న తుది పరీక్ష నిర్వహించింది. 37,600 మంది పరీక్ష రాయగా, 33,921 మంది క్వాలిఫై అయ్యారు. 12వ తేదీలోపు రూ.1000 చెల్లించి OMR వెరిఫికేషన్‌కు రిక్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ <>క్లిక్<<>> చేసి స్కోర్ తెలుసుకోండి. కటాఫ్, ఫైనల్ రిజల్ట్స్‌ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

News July 11, 2025

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కవిత

image

TG: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని BRS MLC కవిత ట్వీట్ చేశారు. ఇది పూర్తిగా రాష్ట్ర బీసీలు, తెలంగాణ జాగృతి సాధించిన విజయమని అభివర్ణించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు అంశంపై కాలయాపన చేయకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

News July 10, 2025

అరుదైన రికార్డు సృష్టించిన రూట్

image

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్(81*) అరుదైన రికార్డు సృష్టించారు. టెస్టుల్లో భారత్‌పై 3 వేల రన్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. 33 మ్యాచ్‌ల్లో 10 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు చేశారు. ఆ తర్వాత రికీ పాంటింగ్ 2555, కుక్ 2431, స్టీవ్ స్మిత్ 2356*, క్లైవ్ లాయిడ్ 2344 రన్స్‌ చేశారు.