News February 16, 2025

MPTC, ZPTC ఎన్నికలు: జనగామ జిల్లా UPDATES

image

జనగామ జిల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు-2025కు సంబంధించిన తుది పోలింగ్ కేంద్రాల జాబితాను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఇటీవల విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 12 మండలాలు ఉన్నాయి. 783 పోలింగ్ కేంద్రాలను ఫైనల్ చేశారు. మొత్తం 134 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 4,01,101 ఓటర్లు ఉన్నారు.

Similar News

News July 5, 2025

వచ్చే జూన్ నాటికి వెలిగొండ పూర్తి చేయాలి: సీఎం

image

AP: 2026 జూన్ నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లివ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జలవనరుల శాఖపై సమీక్షించిన సీఎం.. ఈ నెల 15న హంద్రీనీవా మెయిన్ కెనాల్ ద్వారా జీడిపల్లి జలాశయానికి నీటిని విడుదల చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో 419 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. రానున్న రోజుల్లో కురిసే వర్షాలతో అవి మరింత పెరుగుతాయన్నారు.

News July 5, 2025

ఒక టెస్టులో అత్యధిక పరుగులు వీరివే

image

* గ్రాహం గూచ్(ENG)- 456(333, 123)
* శుభ్‌మన్ గిల్(IND)-430(269, 161)
* మార్క్ టేలర్(AUS)-426(334, 92)
* సంగక్కర(SL)-424(319, 105)
* బ్రియన్ లారా(WI)-400(ఒకే ఇన్నింగ్సు)
* గ్రెగ్ చాపెల్(AUS)-380(247, 133)
* హేడెన్(AUS)-380(ఒకే ఇన్నింగ్సు)
* సందమ్(ENG)-375(325, 50)

News July 5, 2025

విపత్తుల నిర్వహణ అందరి బాధ్యత: జాయింట్ అడ్వైజర్

image

విపత్తుల నిర్వహణ అందరి బాధ్యత అని జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాష్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ కింద ఏర్పాటైన ఆపదమిత్ర వాలంటీర్లు, జిల్లా అధికారులతో చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వరదలు, తుపాన్లు, భూకంపాలు, ప్రమాదాలు సంభవించినప్పుడు సహాయం చేసేందుకు జిల్లాలోనూ ఆపద మిత్రులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.