News February 16, 2025
MPTC, ZPTC ఎన్నికలు: భూపాలపల్లి జిల్లా UPDATES

భూపాలపల్లి జిల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు-2025కు సంబంధించిన తుది పోలింగ్ కేంద్రాల జాబితాను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 12 మండలాలు ఉన్నాయి. 578 పోలింగ్ కేంద్రాలను ఫైనల్ చేశారు. మొత్తం 109 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. భూపాలపల్లి జిల్లాలో మొత్తం 3,03,000 మంది ఓటర్లు ఉన్నారు.
Similar News
News October 30, 2025
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి: డీఐఈవో

రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యా బోధన చేయాలని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి(డీఐఈవో) మాధవి ఆదేశించారు. బుధవారం ఆమె జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ను పరిశీలించిన మాధవి, విద్యార్థులతో మాట్లాడి సబ్జెక్టుల వివరాలు అడిగారు. ప్రతి విద్యార్థిపై అధ్యాపకులు శ్రద్ధ చూపాలని దిశానిర్దేశం చేశారు.
News October 30, 2025
శుభ సమయం (30-10-2025) గురువారం

✒ తిథి: శుక్ల నవమి తె.4.20 వరకు
✒ నక్షత్రం: శ్రవణం మ.2.19 వరకు
✒ శుభ సమయాలు: లేవు, ✒ రాహుకాలం: మ.1.30-3.00
✒ యమగండం: ఉ.6.00-ఉ.7.30
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-10.48, మ.2.48-3.36
✒ వర్జ్యం: సా.6.26-రా.8.04
✒ అమృత ఘడియలు: ఉ.4.39ల
✍️ రోజువారీ పంచాంగం, రాశి ఫలాలు కోసం <<-se_10009>>క్లిక్<<>> చేయండి.
News October 30, 2025
మేడారం జాతరకు పటిష్ఠమైన విద్యుత్ వ్యవస్థ : సీఎండీ

మేడారం మహా జాతర విజయంతానికి పటిష్ఠమైన విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. మేడారంలో పర్యటించి విద్యుత్ పనులను పరిశీలించారు. ములుగు, ఏటూరునాగారం డివిజన్ పరిధిలోని ఇంజినీర్లతో సమీక్ష జరిపారు. జాతర జరిగినన్ని రోజులు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. అవసరమైన మ్యాన్ పవర్ను సమకూర్చుకోవాలని సూచించారు. సంస్థకు మంచి పేరు తీసుకురావాలన్నారు.


