News February 16, 2025
MPTC, ZPTC ఎన్నికలు: భూపాలపల్లి జిల్లా UPDATES

భూపాలపల్లి జిల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు-2025కు సంబంధించిన తుది పోలింగ్ కేంద్రాల జాబితాను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 12 మండలాలు ఉన్నాయి. 578 పోలింగ్ కేంద్రాలను ఫైనల్ చేశారు. మొత్తం 109 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. భూపాలపల్లి జిల్లాలో మొత్తం 3,03,000 మంది ఓటర్లు ఉన్నారు.
Similar News
News March 25, 2025
సిరిసిల్ల జిల్లాలోని ఉష్ణోగ్రతల వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. సిరిసిల్ల 37.9 °c, వీర్నపల్లి 37.8°c, గంభీరావుపేట 37.8°c, కోనరావుపేట 37.6°c, రుద్రంగి 37.7°c, తంగళ్లపల్లి 35.6°c, ఇల్లంతకుంట 35.9°c,ఎల్లారెడ్డిపేట 35.0°cలుగా నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
News March 25, 2025
విశాఖ రైతు బజార్‌లో నేటి కూరగాయల ధరలు

విశాఖ రైతు బజార్‌లలో మంగళవారం నాటి కూరగాయల ధరలు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ విధంగా నిర్ణయించారు. ఉల్లిపాయలు రూ.23, బంగాళ రూ.15, టమాటలు రూ.15, బెండకాయలు రూ.30, వంకాయలు రూ.27/32/40,కాకరకాయలు రూ.38, ఆనపకాయ రూ.14, బీరకాయలు రూ.42, క్యాబేజి రూ.12, కాలి ఫ్లవర్ రూ.20, దొండకాయలు రూ.30,బీట్ రూట్ రూ.20,పొటల్స్ రూ. 46,మునగకాడలు రూ.28, క్యారట్ రూ.20,కీరా దోసకాయ రూ.22,మామిడి కాయలు రూ.40గా నిర్ణయించారు.
News March 25, 2025
షాకింగ్: వాట్సాప్‌లో పదో తరగతి ప్రశ్నాపత్రం

AP: కడప(D) వల్లూరు సెంటర్‌లో నిన్న గణిత పరీక్ష సమయంలో పేపర్ లీక్ అయిందని DEO షంషుద్దీన్ తెలిపారు. వాటర్ బాయ్‌గా పనిచేసే సాయి మహేశ్ ఫొటో తీసి వివేకానంద స్కూల్లో పనిచేస్తున్న విఘ్నేశ్వర్ రెడ్డికి వాట్సాప్ చేసినట్లు గుర్తించారు. విచారణ అనంతరం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. 2 రోజుల క్రితం TGలోని నకిరేకల్‌లోనూ టెన్త్ పేపర్ లీకైంది.