News February 16, 2025
MPTC, ZPTC ఎన్నికలు: రంగారెడ్డి జిల్లా UPDATES

రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు-2025కు సంబంధించిన తుది పోలింగ్ కేంద్రాల జాబితాను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉన్నాయి. 1,358 పోలింగ్ కేంద్రాలను ఫైనల్ చేశారు. మొత్తం 232 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 7,63,603 ఓటర్లు ఉన్నారు.
Similar News
News March 14, 2025
HYD: వైన్స్ బంద్.. తాటికల్లుకు ఎగబడ్డ జనం

హోలీ సందర్భంగా శుక్రవారం ప్రభుత్వం వైన్స్‌లను మూసివేసింది. మందుబాబులకు చుక్క మందు లేదు. దీంతో మత్తు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. ప్రకృతి ప్రసాదించిన తాటికల్లు కోసం క్యూ కట్టారు. తెల్లవారుజామునే ప్రతాపసింగారం సహా నగర శివార్లలో క్యాన్లు, బాటిళ్లతో బారులు తీరారు. గిరాకీ ఊహించని స్థాయికి చేరుకోవడంతో గీత కార్మికుల కళ్లల్లో ఆనందపు వెలుగులు మెరిశాయి.
News March 14, 2025
బాలకృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కార్

HYDలోని జూబ్లీహిల్స్ రోడ్డు నెం.1లో నటుడు బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్‌పాత్‌పైకి ఓ కారు దూసుకెళ్లింది. అతివేగంతో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను కారు ఢీకొట్టింది. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45 మీదుగా చెక్ పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఫెన్సింగ్‌తో పాటు కారు ముందు భాగం ధ్వంసమైంది. కాగా.. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
News March 14, 2025
HYD: హోలీ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత: సీపీ

35 ఏళ్ల తర్వాత ఒకే రోజు హోలీ, రంజాన్ మాసంలో రెండవ శుక్రవారం ఒకేరోజు రావడంతో HYD సీపీ సీవీ ఆనంద్ అధికారులను అప్రమత్తం చేశారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ప్రతీ జోన్, సున్నితమైన ప్రాంతాల్లో పికెట్‌లు ఏర్పాటు చేయాలని, అసాంఘిక శక్తులపై కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, డీసీపీ చైతన్య కుమార్ పాల్గొన్నారు.