News February 17, 2025
MPTC, ZPTC ఎన్నికలు: వికారాబాద్ జిల్లా UPDATES

తెలంగాణలో MPTC, ZPTC ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా వికారాబాద్ జిల్లా తుది జాబితా పోలింగ్ బూత్ వివరాలు వెల్లడించారు.
జడ్పీటీసీ-20
ఎంపీటీసీ-227
పోలింగ్ బూత్‌లు-1288
ఓటర్లు-699894
Similar News
News March 20, 2025
KMR: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

చెరువులో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మరణించిన ఘటన కామారెడ్డి జిల్లా సుల్తాన్ పేట్ గ్రామంలో చోటు చేసుకుంది. సుల్తాన్ పేట్ గ్రామానికి చెందిన అమృత్వార్ రాంబోయ్(47) అనే వ్యక్తి లక్ష్మాపూర్ చెరువులో బుధవారం చేపల వేటకు వెళ్లారు. చెరువు లోతు ఎక్కువ ఉండడంతో ప్రమాదవశాత్తు కాలు వలలో చిక్కుకొని మరణించాడని జాలర్లు పోలీసులకు తెలిపారు.
News March 20, 2025
వచ్చే నెల 19న నంద్యాలకు రానున్న సీఎం

సీఎం చంద్రబాబు వచ్చే నెల 19న నంద్యాలకు రానున్నారు. హరిజనవాడ సమీపంలోని కంపోస్ట్ యార్డులో క్లీన్ అండ్ గ్రీన్‌తో పాటు అక్కడే సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో నంద్యాలకు తొలిసారి వస్తున్నారని టీడీపీ నంద్యాల పట్టణ అధ్యక్షుడు మనియార్ ఖలీల్ అహ్మద్ తెలిపారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
News March 20, 2025
NZB: ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానం

యువ శాస్త్రవేత్తలకు ఇస్రో ఆహ్వానం పలుకుతోంది. యువతకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది యువ విజ్ఞాన కార్యక్రమం(యువికా) నిర్వహిస్తోంది. ఈ సారి 9వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో పాల్గొనే విద్యార్థులకు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఈ నెల 23వ తేదీలోగా www.isro.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.