News February 16, 2025

MPTC, ZPTC ఎన్నికలు: హనుమకొండ జిల్లా UPDATES

image

హనుమకొండ జిల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు-2025కు సంబంధించిన పోలింగ్ కేంద్రాల జాబితాను అధికారులు విడుదల చేశారు. జిల్లాలో 12 ZPTC స్థానాలు ఉన్నాయి. 631 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 129 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లాలో మొత్తం 3,72,646 మంది ఓటర్లు ఉన్నారు.

Similar News

News October 27, 2025

తుఫాను తీరాన్ని తాకడం అంటే ఏంటి?

image

తుఫాను ఏర్పడినప్పుడు సముద్రంలోని సుడిగుండాల మధ్యలో ఉండే భాగాన్ని తుఫాను కన్ను (సైక్లోన్ ఐ) అంటారు. ఇది 50-60 కి.మీ పరిధిలో విస్తరించి ఖాళీగా ఉంటుంది. సైక్లోన్ ఐ తీరాన్ని (భూమిని) తాకితే <<18121128>>తుఫాను తీరాన్ని తాకిందని<<>> అర్థం. అది తీరాన్ని దాటే సమయంలో మేఘాలు చెల్లాచెదురై భారీ వర్షాలు కురుస్తాయి. వరదలు ముంచెత్తుతాయి. భీకర గాలులకు చెట్లు కూలిపోతాయి. సముద్రపు అలలు భూమిపైకి దూసుకొస్తాయి.

News October 27, 2025

భారీ వర్షాలు.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు నష్టపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. సోమవారం సమీక్ష సమావేశం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాలకు తరలించిన వరి ధాన్యం, పత్తి తడవకుండా తక్షణమే టార్పాలిన్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తుఫాను తీవ్రత తగ్గే వరకు వరి కోతలు నిలిపివేయాలని రైతులకు సూచించారు.

News October 27, 2025

నిజామాబాద్: రేపు 12 సోయబిన్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

image

ఇప్పటికే జిల్లాలో వరి, మొక్క జొన్న ధాన్ సేకరణకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సోయాబీన్ రైతుల సౌకర్యార్థం కూడా జిల్లాలో మంగళవారం 12 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. సోమవారం సాయంత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.