News October 9, 2025
MPTC/ZPTC పోరు.. నేడు తొలి విడత నోటిఫికేషన్

యాదాద్రి జిల్లాలో జరగనున్న MPTC/ZPTC ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ గురువారం ఖరారు కానుందని కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు. తొలి విడతలో 10 ZPTC, 84 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అడ్డగూడూరు, మోత్కూరు, ఆలేరు, ఆత్మకూరు, బొమ్మలరామారం, గుండాల, మోటకొండూరు, రాజంపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. మిగతా మండలాలకు 2వ విడతలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
Similar News
News October 9, 2025
కృష్ణా: సచివాలయ ఉద్యోగులకు.. ఇది అయ్యే పనేనా?

CM చంద్రబాబు ప్రతిష్టాత్మక P4 పథకం ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో 99,889, కృష్ణా జిల్లాలో 78,766 మంది పేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. తొలి విడతలో ఎన్టీఆర్‌లో 64,390, కృష్ణాలో 31,967 మందిని దాతలు దత్తత తీసుకున్నారు. సచివాలయ ఉద్యోగులు మధ్యవర్తులుగా వ్యవహరించి, లబ్ధిదారులకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, ఇప్పటికే వివిధ సేవలతో ఉద్యోగులపై భారం పెరుగుతుందని ప్రజలు అంటున్నారు.
News October 9, 2025
6 రోజుల్లోనే రూ.5,620 పెరిగిన గోల్డ్ రేట్

బంగారం ధరలు ఇవాళ కూడా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.220 పెరిగి రూ.1,24,150కు చేరింది. 6 రోజుల్లోనే రూ.5,620 పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.200 ఎగబాకి రికార్డు స్థాయిలో రూ.1,13,800 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,71,000కి చేరుకుంది. 6 రోజుల్లోనే రూ.9వేలు పెరగడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 9, 2025
లక్ష్మీదేవి పద్మం పైనే ఎందుకుంటుంది?

లక్ష్మీదేవిని పద్మంపై ఆసీనురాలిగా చూపడం వెనుక ఆధ్యాత్మిక సందేశం ఉంది. తామరపువ్వు నీటిలో అటూ ఇటూ కదులుతూ, ఊగుతూ ఉంటుంది. ఆ తామర మాదిరిగానే సంపద కూడా చంచలమైనది. అంటే నిలకడ లేనిదని అర్థం. లక్ష్మీదేవి కమలంపై కొలువై ధనం అశాశ్వత స్వభావాన్ని మానవులకు నిరంతరం గుర్తుచేస్తుంది. సంపద శాశ్వతం కాదని, మనిషి గర్వం లేకుండా ఉండాలని ఈ దైవిక రూపం మనకు బోధిస్తుంది. <<-se>>#DHARMASANDEHALU<<>>