News February 16, 2025

MPTC, ZPTC ఎన్నికలు: భూపాలపల్లి జిల్లా UPDATES

image

భూపాలపల్లి జిల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు-2025కు సంబంధించిన తుది పోలింగ్ కేంద్రాల జాబితాను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 12 మండలాలు ఉన్నాయి. 578 పోలింగ్ కేంద్రాలను ఫైనల్ చేశారు. మొత్తం 109 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. భూపాలపల్లి జిల్లాలో మొత్తం 3,03,000 మంది ఓటర్లు ఉన్నారు.

Similar News

News December 15, 2025

సంగారెడ్డి: మూడో విడతకు భారీ బందోబస్తు

image

ఈనెల 17న జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు ఎస్పీ రఘునందన్ రావు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్, కౌంటింగ్ ముగిసే వరకు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు.

News December 15, 2025

తిరుపతి: ఇంధన పరిరక్షణ వారోత్సవాలలో భాగంగా సైకిల్ ర్యాలీ

image

ఇంధన పరిరక్షణ వారోత్సవాల సందర్భంగా APSPDCL ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో సోమవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్పొరేట్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరంలోని ప్రధాన ప్రాంతాల మీదుగా సాగింది. డైరెక్టర్లు అయూబ్ ఖాన్, గురవయ్య ర్యాలీని ప్రారంభించారు. సుమారు 200 మంది ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొని ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు. భావితరాల కోసం ప్రతి ఒక్కరూ ఇంధనాన్ని ఆదా చేయాలని పిలుపునిచ్చారు.

News December 15, 2025

ముగిసిన తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం

image

TG: రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పటికే 394 పంచాయతీలు, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఎల్లుండి(DEC 17) 182 మండలాల్లో మిగిలిన 3,752 పంచాయతీలు, 28,406 వార్డులకు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. 11 గ్రామాలు, 112 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. తొలి రెండు విడతల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాలు గెలిచిన సంగతి తెలిసిందే.